Breaking News
  • ప.గో: చింతలపూడి జెడ్పీ పాఠశాలలో లైంగిక వేధింపులు. మహిళా టీచర్‌ను లైంగికంగా వేధిస్తున్న తోటి టీచర్‌. డీఈవో, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసిన కలెక్టర్‌.
  • తిరుపతి: పలమనేరు అటవీప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల కేసు. 8 మందిపై కేసునమోదు, ఇప్పటికే పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు. నిందితులను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు ఏర్పాటు. కీలక నిందితుడు చెన్నైకి చెందిన స్వామీ జయచంద్రన్‌ కోసం గాలింపు. రుయాలో చికిత్సపొందుతున్న బాధితుడు గణేష్‌ పరిస్థితి విషమం. కాలిన గాయాలతో ఈ నెల 12న ఆస్పత్రిలో చేరిన గణేష్‌. గణేష్‌ను నరబలి ఇచ్చేందుకు యత్నించారంటున్న కుటుంబసభ్యులు. విద్యుత్‌షాక్‌తో గణేష్‌ ప్రమాదానికి గురయ్యాడంటున్న పోలీసులు.
  • టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి భూకబ్జా, కేసుల చిట్టా. 2016 జనవరి 13న రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై.. గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. గోపన్‌పల్లిలోని భూమిని కబ్జా చేసేందుకు.. ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై సెక్షన్‌ 447, 427, 506.. రెడ్‌విత్‌ 34, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసునమోదు. టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యల చార్జిషీట్‌. 16 మంది సాక్షులను విచారించిన గచ్చిబౌలి పోలీసులు. గోపన్‌పల్లిలోని సర్వేనెంబర్‌ 127లో భూకబ్జాకు ప్రయత్నించారు. అడ్డుకున్నందుకు బాధితులను బూతులు తిట్టినట్టు తేల్చిన పోలీసులు. సర్వేనెంబర్‌ 127లో తమకు చెందని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం. కోర్టులో 28 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు.
  • గోపన్‌పల్లి భూవివాదంపై స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ . కొండల్‌రెడ్డితో అప్పటి తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి కుమ్మక్కయ్యారు. గోపన్‌పల్లి భూ వివాదంలో అప్పటి తహశీల్దార్‌ అవకతవకలకు పాల్పడ్డారు. కొండల్‌రెడ్డికి సంబంధం లేని భూమిని శ్రీనివాస్‌రెడ్డి మ్యుటేషన్‌ చేయించారు. -టీవీ9తో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌. డిప్యూటీ తహశీల్దారు శ్రీనివాస్‌రెడ్డి తన అధికారాలకు విరుద్ధంగా.. రికార్డుల్లో లేనివ్యక్తి భూమిని కొండల్‌రెడ్డికి మ్యుటేషన్ చేయించారు. ఈ వివాదంలో మరో ఇద్దరు తహశీల్దార్ల పాత్ర కూడా గుర్తించాం. తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వానికి లేఖ రాశాం-టీవీ9తో రంగారెడ్డిజిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్.
  • గోపన్‌పల్లి భూవివాదంలో గతంలోనే రేవంత్‌రెడ్డిపై కేసులు. 2016 జనవరి 13న రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై.. గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. గోపన్‌పల్లిలోని భూమిని కబ్జా చేసేందుకు.. ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై సెక్షన్‌ 447, 427, 506.. రెడ్‌విత్‌ 34, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసునమోదు. టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యల చార్జిషీట్‌. 16 మంది సాక్షులను విచారించిన గచ్చిబౌలి పోలీసులు. గోపన్‌పల్లిలోని సర్వేనెంబర్‌ 127లో భూకబ్జాకు ప్రయత్నించారు. అడ్డుకున్నందుకు బాధితులను బూతులు తిట్టినట్టు తేల్చిన పోలీసులు. సర్వేనెంబర్‌ 127లో తమకు చెందని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం. కోర్టులో 28 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు.

పార్టీ విప్ పక్కన పెట్టేశారు… రాపాక దారి ఇక రహదారే

rapaka route separate, పార్టీ విప్ పక్కన పెట్టేశారు… రాపాక దారి ఇక రహదారే

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు తన దారి రహదారేనని చాటుకున్నారు. ముసుగులో గుద్దులాట ఎందుకనుకున్నారో ఏమో… ఏకంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లిఖిత పూర్వకంగా జారీ చేసిన విప్‌ని తుంగలో తొక్కేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించారు. పార్టీ విధానానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మూడు రాజధానుల ప్రతిపాదన గట్టిగా సమర్థించారు.

ముందుగా చెప్పినట్లుగానే తన మాట మీద తాను నిలబడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేస్తానని ముందే చెప్పిన రాపాక… తనను అడ్డుకునేందుకు జనసేన అధినేత చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టారు. తన దారి రహదారేనని.. ఇక మీరేదైనా చర్య తీసుకోవచ్చంటూ పరోక్షంగా పార్టీకి సవాల్ విసిరారు రాపాక. పార్టీ విధానానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రకటన చేసిన రాపాక వరప్రసాద్.. బిల్లుపై ఓటింగ్ జరిగితే.. అనుకూలంగా ఓటు కూడా వేస్తానని చెప్పారు.

ఇదివరకే వైసీపీతో అంటకాగుతున్న రాపాక.. తరచూ ముఖ్యమంత్రిని కూడా కలుస్తూ వస్తున్నారు. ఇదేమంటే.. నియోజకవర్గం అభివృద్ది కోసమని చెబుతున్నారు. గట్టిగా అడగలేని పరిస్థితిలో ఇంతకాలం కొట్టుమిట్టాడిన జనసేన అధినాయకత్వం.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమైనట్లే.. సోమవారం మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించాలంటూ ఏకైక ఎమ్మెల్యేకు విప్ జారీ చేసింది. లిఖితపూర్వకంగా సాక్షాత్తు అధినేత పంపిన లేఖను బేఖాతరు చేసిన రాపాక.. సభలో మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతు ప్రకటించారు. తద్వారా బంతిని తిరిగి పవన్ కల్యాణ్ కోర్టులోకి నెట్టిన రాపాక.. తనపై వేటు వేస్తే.. డైరెక్టుగా వైసీపీతో కలిసి పని చేసేందుకు సిద్దమవుతున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.rapaka route separate, పార్టీ విప్ పక్కన పెట్టేశారు… రాపాక దారి ఇక రహదారే

Related Tags