ఫొటో కోసం తాపత్రయం..వెంటాడిన పులి

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు పెద్దలు. ఇప్పుడీ నానుడి నిజమైంది. కొందరు పర్యాటకులు పులి నోటి దాకా వెళ్లి..ఇంకా భూమ్మీద నూకలుండి ప్రాణాలతో బయటపడ్డారు. రాజస్థాన్‌లోని రణతంబోర్‌ నేషనల్‌ పార్క్‌లో జరిగింది ఈ ఘటన కొంతమంది పర్యాటకులు పులులను చూసేందుకు ఓపెన్‌ టాప్‌ జీపులో బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక ఓ టైగర్‌ వారి కంటబడింది. ఐతే దాన్ని తమ మొబైల్‌లో బంధించాలనే అత్యుత్సాహంతో ఫొటో క్లిక్‌ మనిపించారు. ఇంకేముంది. ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న జీపు వైపు పరుగులు […]

ఫొటో కోసం తాపత్రయం..వెంటాడిన పులి
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 04, 2019 | 3:48 PM

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు పెద్దలు. ఇప్పుడీ నానుడి నిజమైంది. కొందరు పర్యాటకులు పులి నోటి దాకా వెళ్లి..ఇంకా భూమ్మీద నూకలుండి ప్రాణాలతో బయటపడ్డారు. రాజస్థాన్‌లోని రణతంబోర్‌ నేషనల్‌ పార్క్‌లో జరిగింది ఈ ఘటన కొంతమంది పర్యాటకులు పులులను చూసేందుకు ఓపెన్‌ టాప్‌ జీపులో బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక ఓ టైగర్‌ వారి కంటబడింది. ఐతే దాన్ని తమ మొబైల్‌లో బంధించాలనే అత్యుత్సాహంతో ఫొటో క్లిక్‌ మనిపించారు. ఇంకేముంది. ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న జీపు వైపు పరుగులు పెట్టింది ఆ టైగర్‌.జీపుపైకి దూకేందుకు యత్నించింది.

దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వాహనాన్ని వెనక్కి మూవ్ చేసినా అది వదిలిపెట్టలేదు. జీపును వెంబడించింది. మళ్లీ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించినా..ఆ పులి కూడా జీపునే ఫాలో అవడంతో డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి టైగర్‌ బారి నుంచి పర్యాటకులను కాపాడాడు. ఇప్పుడీ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. లక్షల కొద్దీ వ్యూస్‌, షేర్స్‌తో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.