Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 236657. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 115942. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 114073. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6642. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కేటీఆర్ ఆదేశాలతో నటి మీరాచోప్రా ఫిర్యాదు ఫై దర్యాప్తు ముమ్మరం . మీరాచోప్రా ను ట్రోల్ చేసిన 15 ట్విటర్ హ్యాండిల్స్ గుర్తింపు . 15 మందికి నోటీసులు పంపిన పోలిసులు. అసభ్యం గా ట్వీట్ చేసిన 15 మంది ని అరెస్ట్ చేసే అవకాశం.
  • అమర్‌నాథ్ యాత్రకు పచ్చజెండా. జులై 21 నుంచి ఆగస్టు 3 వరకు యాత్ర. 15 రోజులు మాత్రమే యాత్రా సమయం. 55ఏళ్లు పైబడినవారికి యాత్రకు అనుమతి లేదు. కోవిడ్-19 జాగ్రత్తలతో యాత్రకు ఏర్పాట్లు. కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి. బాల్తాల్ మార్గంలో మాత్రమే యాత్రకు అనుమతి. పహల్‌గాం వైపు నుంచి ఉన్న యాత్రామార్గం మూసివేత.
  • తిరుపతి: టిటిడి సప్తగిరి మాస పత్రిక చీఫ్ ఎడిటర్ రాధా రమణ, సబ్ ఎడిటర్ ఉత్తర ఫల్గుణ ని సస్పెండ్ చేసిన జేఈవో బసంత్ కుమార్. సప్తగిరి పత్రికలో కుసుడు ఆర్టికల్ ను ప్రచురించి ఉద్దేశపూర్వకంగా టిటిడి ని చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారనే కారణాలతో సస్పెన్షన్. 2016లో నిషేధించిన కథనాన్ని పునీత్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి పేరుతో ప్రచురించారని విజిలెన్స్ ఎంక్వయిరీలో తేలడంతో సస్పెన్షన్. సప్తగిరి పత్రిక వివాదం పై విచారణ కొనసాగుతోందన్న టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.
  • తిరుమల: టీటీడీ ఈఓ కామెంట్స్. దూరప్రాంతాల భక్తులెవ్వరూ తొందరపడి తిరుమలకు రాకండి. ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని వస్తే ఇబ్బందులు ఉండవు. కౌంటర్ల ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు ఇస్తుండటంతో తిరుపతిలో టికెట్లు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. టీటీడీ మార్గదర్శకాల్లో ఎవరైనా మార్పులు సూచిస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్.
  • ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయంలో ఐదుగురికి కరోనా పాజిటివ్. ఖాన్ మార్కెట్ లోని లోక్ నాయక్ భవన్ మూసివేత. ఈడి కార్యాలయాన్ని శానిటైజ్ చేసిన అధికారులు.. రేపు కూడా మూసిఉండనున్న ఈడి కార్యాలయం. హోమ్ క్వారేంటిన్ లోకి వెళ్లిన పలువురు అధికారులు.

భల్లాలదేవుడు ఈజ్ బ్యాక్..రానా న్యూ లుక్ అదరహో..

Daggubati Rana's New Look Goes Viral, భల్లాలదేవుడు ఈజ్ బ్యాక్..రానా న్యూ లుక్ అదరహో..

రానా దగ్గుబాటి…ఈయనను స్టార్ హీరో అనడం కంటే నటుడు అనడం బెటర్. ఎందుకంటే రానా పాత్రలకు పరిధి పెట్టుకోడు. తన క్యారెక్టర్ ఎంత లెంగ్త్ ఉందో చూసుకోడు. మంచి ప్రాముఖ్యత ఉంటే చాలు అని భావిస్తాడు. ఎప్పుడూ కొత్తదనం కోసం ఆరాటపడుతూ ఉంటాడు. అవే అతడిని మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. భాషా బేధాలు లేకుండా రాానా ఇప్పుడు అన్ని ఇండష్ట్రీలలో అదరగొడుతున్నాడు. కాగా ఇటీవల రానా ఆరోగ్య పరిస్థితిపపై పలు రకాల రూమర్స్ వచ్చాయి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ కోసం అతడు విదేశాలకు వెళ్లాడని చాలా చర్చ జరిగింది. అయితే వాటిని దగ్గుబాటి ఫ్యామిలీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది.

అయితే  ఆ సమయంలో బయటకు వచ్చిన  రానా లుక్ మాత్రం అందర్నీ షాక్‌కి గురి చేసింది. పూర్తిగా బక్కచిక్కిపోయిన తమ అభిమాన హీరో లుక్ చూసి ఫ్యాన్స్ అయితే తీవ్ర కంగారు పడ్డారు. ఆ తర్వాత నుంచి రానా మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో..వెంకీమామ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చెయ్యడానికి ఓ ప్రొమెషనల్ వీడియో చేశాడు. దాంట్లో రానా జిమ్‌లో చెమటలు చిందిస్తూ కనిపించాడు. మరీ బాహుబలి టైం ఉన్నంత కాకపోయినా..ప్రజంట్ రానా లుక్ మాత్రం సమ్‌థింగ్ బెటర్ అని చెప్పాలి. పూర్తి హెల్దీ అండ్ ఫిట్‌గా కనిపించడంతో…ఫ్యాన్స్ పుల్ జోష్‌లో ఉన్నాడు. కాగా రానా ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమాను చేస్తున్నాడు. వీటితో పాటు పలు సౌత్ ఇండియన్, బాలీవుడ్ చిత్రాల్లో కూడా మన టాలీవుడ్ హంక్ మెస్మరైజ్ చేయనున్నాడు.

Related Tags