పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోయిన శ్యామ్ అతని అనుచరులు

పంజాగుట్టలో శనివారం హత్యకు గురైన కృష్ణా జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త రాం ప్రసాద్ హత్యకేసు మరో మలుపు తిరిగింది. ఈ హత్యకు మృతుడి బావమరిది ఊర శ్రీనివాస్ కారణమని, అతడు చెప్పడం వల్లే తాము హత్య చేశామని ముగ్గురు వ్యక్తులు టీవీ9తో చెప్పారు. రాం ప్రసాద్‌ను హత్యచేస్తే తనకు డబ్బులు వస్తాయనే ఇలా చేశానని, ఈ హత్యకు కోగంటి సత్యంకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడకు చెందిన శ్యామ్ అంటున్నాడు. తన సొంత బొలెరో కారులో తన […]

పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోయిన  శ్యామ్ అతని అనుచరులు
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2019 | 9:50 PM

పంజాగుట్టలో శనివారం హత్యకు గురైన కృష్ణా జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త రాం ప్రసాద్ హత్యకేసు మరో మలుపు తిరిగింది. ఈ హత్యకు మృతుడి బావమరిది ఊర శ్రీనివాస్ కారణమని, అతడు చెప్పడం వల్లే తాము హత్య చేశామని ముగ్గురు వ్యక్తులు టీవీ9తో చెప్పారు. రాం ప్రసాద్‌ను హత్యచేస్తే తనకు డబ్బులు వస్తాయనే ఇలా చేశానని, ఈ హత్యకు కోగంటి సత్యంకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడకు చెందిన శ్యామ్ అంటున్నాడు. తన సొంత బొలెరో కారులో తన శిష్యులు చోటు, రమేశ్‌ల సహకారంతో ఈ హత్య చేశానని చెబుతున్నాడు.

అయితే తాము చంపిన రాం ప్రసాద్‌, ఊర శ్రీనివాస్‌లకు గతంలో ఆర్ధిక పరమైన గొడవలున్నాయని, ఈ నేపధ్యంలో రాం ప్రసాద్‌ను చంపితే తనకు డబ్బులిస్తానని ఊర శ్రీనివాస్ తనతో చెప్పాడని నిందితుడు శ్యామ్.. టీవీ9కు చెప్పాడు. పంజాగుట్టలో చంపడానికి కూడా ఊర శ్రీనివాసే కారణమని, అతడు చెప్పడం వల్లే తమకు ఈ అడ్రస్ తెలిసిందన్నాడు.

ఈ హత్యకు మూడు కత్తుల్ని ఉపయోగించామని, వాటిని తన సొంత వాటర్ ప్లాంట్‌లోనే తయారుచేయించానని , తాము ప్రయాణించిన బొలెరో కారు కూడా తనదేనని తెలిపాడు నిందితుడు శ్యామ్. మరోవైపు హత్యలో శ్యామ్‌తో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా శ్యామ్ రమ్మంటే వచ్చామని, మా లైఫ్ సెటిల్ చేస్తానని మాటివ్వడంతోనే ఈ మర్డర్‌కు పాల్పడ్డామని తెలిపారు.  పంజాగుట్ట పోలీసుల ముందు ముగ్గురు నిందితులు లొంగిపోయారు.

ఇదిలా ఉంటే .. అసలు శ్యామ్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని టీవీ9‌తో చెప్పాడు రాం ప్రసాద్ బావమరిది ఊర శ్రీనివాస్, ఈ హత్యలో తన ప్రమేయముంటే దర్యాప్తులో వెల్లడవుతుందన్నాడు. రాం ప్రసాద్‌ను చంపాల్సిన అవసరం తనకు లేదని, తన బావను ఎందుకు చంపుకుంటానన్నాడు శ్రీనివాస్.

ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు