భద్రాద్రి ఆలయంలో.. రాజుకున్న ‘రామనారాయణ’ వివాదం..!

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో కొలువున్నది శ్రీరాముడా.. రామనారాయణుడా? అనే వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి, భద్రాద్రి దేవస్థానం వైదిక సిబ్బంది ఈ అంశంపై విమర్శలు, ప్రతి విమర్శలతో చర్చకు తెరలేపారు. భద్రాచలంలో కొలువై ఉన్నది శ్రీరామచంద్రుడేనని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి, రామ భక్తులు పేర్కొంటుండగా.. వైకుంఠం నుంచి వచ్చి భద్రుని కోరికపై శంఖుచక్రాలు, ధనుర్బాణాలతో కొలువై ఉన్న స్వామి వారు కాబట్టి రామనారాయణుడుగా భావించాలని దేవస్థానానికి చెందిన వైదిక సిబ్బంది […]

భద్రాద్రి ఆలయంలో.. రాజుకున్న ‘రామనారాయణ’ వివాదం..!
Follow us

| Edited By:

Updated on: Feb 13, 2020 | 1:15 PM

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో కొలువున్నది శ్రీరాముడా.. రామనారాయణుడా? అనే వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి, భద్రాద్రి దేవస్థానం వైదిక సిబ్బంది ఈ అంశంపై విమర్శలు, ప్రతి విమర్శలతో చర్చకు తెరలేపారు. భద్రాచలంలో కొలువై ఉన్నది శ్రీరామచంద్రుడేనని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి, రామ భక్తులు పేర్కొంటుండగా.. వైకుంఠం నుంచి వచ్చి భద్రుని కోరికపై శంఖుచక్రాలు, ధనుర్బాణాలతో కొలువై ఉన్న స్వామి వారు కాబట్టి రామనారాయణుడుగా భావించాలని దేవస్థానానికి చెందిన వైదిక సిబ్బంది పేర్కొంటున్నారు.

కాగా.. భద్రాద్రి దేవస్థానం వైదిక సిబ్బంది మాత్రం.. భద్రాదిల్రో వెలసిన శ్రీరామచంద్రుడిని కోదండ రాముడుగా, భద్రాద్రి రాముడుగా, వైకుంఠ రాముడుగా, ఓంకార రాముడుగా, రామనారాయణుడుగా కొలవడం జరుగుతోందని పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని తమ అనువంశిక అర్చకత్వంలో ఎందరో పెద్దలు ప్రస్తావించడాన్ని వారు ఉదాహరిస్తున్నారు. అయితే.. స్వామివారికి నిర్వహించే నిత్య కల్యాణాల్లో ప్రవర చదివే సమయంలో ‘రామచంద్ర స్వామినే వరాయ’ అని చెప్పాల్సి ఉండగా.. ‘రామనారాయణ స్వామినే వరాయ’ అని మార్చడం ద్వారా అర్చకులు అపచారం చేస్తున్నారని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి ఆరోపిస్తూ తమ వద్ద ఉన్న ఆధారాలను చూపే ప్రయత్నం చేస్తోంది. శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికి తూట్లు పొడుస్తూ ఈ విధంగా మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తోంది.

దీనిపై స్పందిస్తూ సీఎంకు లేఖ రాస్తామంటున్నారు భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి సభ్యులు. అప్పటికీ స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు స్పష్టంచేశారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!