Breaking News : అయోధ్య రాముడి గుడి భూమి పూజకు తేదీ ఖరారు

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పలు నిర్ణయాలు చేసింది. భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నారు. వర్షాకాలం తర్వాత రాష్ట్రాల వ్యాప్తంగా తిరిగి 10 కోట్ల కుటుంబాలను సంప్రదిస్తామని తెలిపారు. ..

Breaking News : అయోధ్య రాముడి గుడి భూమి పూజకు తేదీ ఖరారు
Follow us

|

Updated on: Jul 19, 2020 | 6:49 AM

Ram Temple Construction Date Fixed : అయోధ్య రాముడి గుడి భూమి పూజకు తేదీని ఖరారు చేశారు. ఆగస్టు 5వ తేదీన భూమి పూజ నిర్వహించాలని రామ జన్మభూమి ట్రస్ట్ నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మించడానికి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాటయింది. ఇవాళ సమావేశమైన ట్రస్ట్ సభ్యులు పలు అంశాలపై చర్చించారు.

ఆగస్టు 5వ తేదీన రామాలయానికి భూమి పూజను నిర్వహించాలని నిర్ణయించారు. రామాలయం నిర్మాణపనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించనున్నారు. త్వరితగతిన రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న  ట్రస్ట్ నిర్ణయించారు. వర్షాకాలం తర్వాత రాష్ట్రాల వ్యాప్తంగా తిరిగి 10 కోట్ల కుటుంబాలను సంప్రదిస్తామని తెలిపారు. కరోనా సద్దుమణిగాక దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించే అవకాశం ఉందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.

అయితే రామాలయం శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొంటారని ట్రస్టు ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా చెప్పిన సంగతి తెలిసిందే.. ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖలు పాల్గొంటారని ట్రస్టు సభ్యులు వివరించారు.