వర్మా! సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్.?

శిష్యుడు పూరి జగన్నాధ్.. చాలారోజులకు హిట్ కొట్టాడని ఆనందమో లేక తన స్టైల్‌లో వెరైటీగా ట్రై చేయాలనీ అనుకున్నాడో గానీ.. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి మీడియాలో సంచలనం అయ్యాడు. హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూడడానికి వర్మ.. మరో ఇద్దరి దర్శకులతో ఒకే బైక్‌పై పబ్లిక్‌లో వెళ్తూ సందడి చేశాడు. వర్మతో వచ్చిన ఆ ఇద్దరు దర్శకుల్లో ఒకరు ‘ఆర్ఎక్స్ 100’ అజయ్ భూపతి, మరొకరు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అగస్త్య. ఈ ముగ్గురు పక్కా మాస్ గెటప్స్‌లో ఒకే బైక్ పై వెళ్తుంటే కొందరు గుర్తుపట్టి ఫోటోలు తీశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే వర్మ వినూత్న ఐడియాలకు ఇదో నిదర్శనంగా కనిపిస్తుంది.

అంతా బాగానే ఉంది గానీ.. సెలబ్రిటీ హోదాలో ఉన్న వీళ్ళు ఒకే బైక్ పై.. హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్ చేయడంతో కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కాగా దీనికి హైదరాబాద్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *