ట్రంప్-మోదీ సంభాషణపై వర్మ ట్వీట్..!.. నెట్టింట్లో దుమ్మురేపుతోన్న డైలాగ్..!

వివాదాస్పద డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడూ ట్విట్టర్ వేదికగా ఏవరినో ఒకర్ని టార్గెట్ చేస్తూ.. ట్వీట్స్ చేస్తుంటారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని పలు సరదా ట్వీట్స్ చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ట్రంప్.. మంగళవారం అమెరికాకు తిరిగివెళ్లారు. అయితే ట్రంప్‌కు స్వాగతం పలుకుతూ గుజరాత్ రాష్ట్రంలో ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో.. […]

ట్రంప్-మోదీ సంభాషణపై వర్మ ట్వీట్..!.. నెట్టింట్లో దుమ్మురేపుతోన్న డైలాగ్..!
Follow us

| Edited By:

Updated on: Feb 27, 2020 | 4:29 AM

వివాదాస్పద డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడూ ట్విట్టర్ వేదికగా ఏవరినో ఒకర్ని టార్గెట్ చేస్తూ.. ట్వీట్స్ చేస్తుంటారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని పలు సరదా ట్వీట్స్ చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ట్రంప్.. మంగళవారం అమెరికాకు తిరిగివెళ్లారు. అయితే ట్రంప్‌కు స్వాగతం పలుకుతూ గుజరాత్ రాష్ట్రంలో ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో.. మోతెరా స్టేడియంలో “నమస్తే ట్రంప్‌” పేరుతో భారీ సభను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది వరకు హాజరయ్యారు. ఈ సభను ఉద్దేశిస్తూ.. ట్రంప్‌ – మోదీ సంభాషణ గురించి వర్మ ఓ సరదా ట్వీట్‌ పెట్టారు.

ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు డెబ్బై లక్షల మంది వస్తారని తొలుత వార్తలు వచ్చాయి. ఈ వైరల్ వార్తలనుద్దేశిస్తూ.. ట్రంప్ మోదీని అడిగినట్లు వర్మ ట్వీట్ చేశారు.”నాకు ఘన స్వాగతం పలికేందుకు 70 లక్షల మంది వస్తారన్నావ్.. లక్ష మందే వచ్చారేంటి?” అనిట ట్రంప్ ప్రశ్నించినట్లు.. ఆ ప్రశ్నకు మోదీ.. “ఇండియన్‌ కరెన్సీలో 70 రూపాయలకు.. అమెరికా 1 డాలర్‌ ఎలా సమానమో.. 70 మంది అమెరికన్లకు ఒక గుజరాతీ సమానం” అని సమాధానం ఇచ్చినట్లు వర్మ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌.. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.