చెర్రీ నిర్మాణంలో పవన్ తనయుడి టాలీవుడ్ ఎంట్రీ..!

Akira Nandan Tollywood Entry Confirm?, చెర్రీ నిర్మాణంలో పవన్ తనయుడి టాలీవుడ్ ఎంట్రీ..!

రాజకీయాలపైనే మొత్తం దృష్టిని పెట్టిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. దీంతో ఆయన లేని లోటు టాలీవుడ్‌లో బాగా కనిపిస్తోంది. మెగాభిమానులతో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు కూడా పవన్ కల్యాణ్‌ను బాగా మిస్ అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఓ శుభవార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పవన్ తనయుడు అకీరా నందన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు అకీరా ఎంట్రీ విషయంలో.. పవన్ ముందుండి మరీ బాధ్యతలు తీసుకుంటున్నట్లు సమాచారం. అందువల్లనే ఇటీవల పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా పూణే నుంచి హైదరాబాద్ షిప్ట్ అయినట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే మరాఠీలో రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన ఇష్క్ వాలా లవ్ మూవీలో అకీరా చిన్న పాత్రలో మెరిశాడు. ఈ సినిమాను ఇక్కడ డబ్ చేసి విడుదల చేయాలని భావించినా.. కొన్ని కారణాల వలన అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఓ స్ట్రైట్ సినిమాతో అకీరా ఎంట్రీ ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఫిలింనగర్ టాక్ ప్రకారం అకీరా మొదటి సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించబోతున్నాడట.

ఇదిలా ఉంటే ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో అకీరా గురించి చెప్పుకొచ్చిన రేణు దేశాయ్.. అతడిని సినిమాల్లోకి తీసుకురావాలని అనుకోవడం లేదని తెలిపింది. అంతేకాదు జూనియర్ పవర్‌స్టార్ అన్న బిరుదు అకీరాకు వద్దని కూడా ఆమె పలు సందర్భాలలో వెల్లడించింది. భవిష్యత్‌లో ఏం కావాలనుకున్నది అకీరా ఇష్టమని.. ఆ విషయంలో తాను పూర్తి స్వేచ్ఛను ఇస్తానని ఆమె పేర్కొంది. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్‌లో అసలు అకీరా ఎంట్రీ ఉండబోతుందా..? ఒకవేళ వస్తే ఎలాంటి కథతో ముందుకొస్తాడు..? అకీరా మొదటి సినిమా దర్శకుడెవరు..? రామ్ చరణ్‌ నిర్మాణంలోనే అకీరా ఎంట్రీ ఇస్తాడా..? అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *