Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 16 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 216919. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 106737. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 104106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6075. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • జిహెచ్‌ఎంసి స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుదల చేసిన కమిషనర్ లోకేష్ కుమార్ . కొత్త స్టాండింగ్ క‌మిటీ ఎంపిక‌కు రేపు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ . ఈ నెల 10 నుండి 18 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ .
  • ఇంటర్ బోర్డ్ , ఎగ్జామినర్ ల మధ్య బస్ ఛార్జ్ ల లొల్లి. పేపర్ వాల్యుయేషన్ కి వచ్చే వారి కోసం ఆర్టీసీ బస్ లు ఏర్పాటు చేసిన ఇంటర్ బోర్డ్ . ఎగ్జామినర్ ల నుండి ఆ టైం లో ఛార్జ్ లు వసూలు చేయని ఆర్టీసీ. ఇంటర్ బోర్డ్ ఆర్టీసీ కి రాసిన లేఖతో టికెట్ ఛార్జ్ లు తీసుకొని ఆర్టీసీ . ఇప్పుడు ఛార్జ్ లు కట్టాలని అంటున్న ఇంటర్ బోర్డ్ .
  • పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై హైకోర్టుకు నివేదికలో విద్యా శాఖ. పదో తరగతి పరీక్ష కేంద్రాలను 2530 నుంచి 4535కి పెంచాం. పదో తరగతి విద్యార్థులకు కొత్తగా హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. పరీక్ష కేంద్రాల వివరాలను విద్యార్థులకు సమాచారం ఇచ్చాం. థర్మల్ స్క్రీనింగ్ కిట్లు, మాస్కులు, గ్లవుజులు సేకరించి కేంద్రాలకు పంపించాం. కేంద్రానికి ఒకరు చొప్పున 4,535 మంది వైద్య సిబ్బంది. డీఈఓ కార్యాలయాల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు.
  • తెలుగు ఐఏఎస్ అధికారికి కీలక బాధ్యతలు అమెరికాలోని భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా రవి కోట నియామకం ప్రధాని అధ్యక్షతన కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం వాషిగ్టంట్ (డీసీ)లోని రాయబార కార్యాలయంలో విధులు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్న రవి కోట.
  • తిరుమల: శ్రీవారి దర్శనాలపై టీటీడీ ఈఓ కామెంట్స్. 8వ తేది నుండి భక్తులకు దర్శనాలు కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రేపు మరోసారి సమావేశం నిర్వహించి దర్శన విధానాలను ప్రకటిస్తాం. భక్తుల సంఖ్య, గదుల కేటాయింపు, రవాణా, ప్రసాదాల విక్రయం, టైంస్లాట్ టికెట్ల విధానం, థర్మల్ స్క్రీనింగ్, అన్న ప్రసాద భవనం ప్రారంభం వంటి అంశాలపై అంచనాకు వచ్చాం. దర్శన విధి విధానాలను నిర్ణయించి 8వ తేది నుండి దర్శనాలు ప్రారంభిస్తాం. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్.
  • తాడేపల్లి : తాడేపల్లి లో గల ఉండవల్లి సెంటర్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసానికి అతి చేరువలో గల ఎన్టీఆర్ కట్ట మరియు క్రిస్టియన్ పేట లో ఈరోజు 4 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో అప్రమత్తమైన అధికారులు. కాగా ఇందులో ఇద్దరు వాలంటీర్లు ఉండటంతో ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది. వాలంటీర్లు ఇద్దరు గత మూడు రోజుల క్రితం తాడేపల్లి లో గల ప్రాంతాలలో పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం. అధికారులు తాడేపల్లి ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని అన్ని రకాల శానిటేషన్ పనులను చేస్తున్నారు.

Ram Charan: చెర్రీ నెక్ట్స్ మూవీ.. లైన్‌లోకి స్టార్ దర్శకుడు.. ఈసారైనా కుదురుతుందా!

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్నారు రామ్ చరణ్, ఎన్టీఆర్. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నప్పటికీ.. షూటింగ్ ఈ ఏడాది ప్రథమార్ధంలోపు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తదుపరి సినిమాను ఫిక్స్ చేసుకున్నారు ఎన్టీఆర్.
Ram Charan next movie, Ram Charan: చెర్రీ నెక్ట్స్ మూవీ.. లైన్‌లోకి స్టార్ దర్శకుడు.. ఈసారైనా కుదురుతుందా!

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్‌’లో నటిస్తున్నారు రామ్ చరణ్, ఎన్టీఆర్. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నప్పటికీ.. షూటింగ్ ఈ ఏడాది ప్రథమార్ధంలోపు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తదుపరి సినిమాను ఫిక్స్ చేసుకున్నారు ఎన్టీఆర్. త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండోసారి నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే రామ్ చరణ్ మాత్రం ఇంకా డైలమాలో ఉన్నారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి, సాహో ఫేమ్ సుజీత్ ఇప్పటికే చెర్రీకి కథలు చెప్పినట్లు తెలుస్తుండగా.. వారిద్దరి కథలు ఈ హీరోకు నచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా మరో స్టార్ దర్శకుడు లైన్‌లోకి వచ్చారు. ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తోన్న కొరటాల శివ, రామ్ చరణ్‌తో తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్.

కాగా ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన కొరటాల శివ.. ఆ తరువాతి సినిమానే చెర్రీతో ప్రకటించారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా అప్పట్లో పూర్తి అయ్యాయి. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక ‘రంగస్థలం’ సినిమా షూటింగ్ సమయంలో మరోసారి కొరటాలతో సినిమాను అధికారికంగా ప్రకటించారు రామ్ చరణ్. కానీ ఈ క్రేజీ కాంబోకు మరోసారి బ్రేక్ పడగా.. అది కాస్త మెగాస్టార్ చిరంజీవికి వెళ్లింది. పోని మెగాస్టార్ సినిమాలోనైనా ఒక కీలక పాత్రలో చెర్రీ నటించాలనుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వలన అది కూడా అవ్వలేకపోయింది. ఈ క్రమంలో కొరటాల దర్శకత్వంలో నటించాలనుకున్న చెర్రీ ఆశ అలానే ఉండిపోయింది. మరోవైపు చెర్రీతో ఎలాగైనా సినిమా చేయాలని కొరటాల కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు మూవీ తరువాత చెర్రీని డైరక్ట్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ విజయంపై ఏ మాత్రం డోకా లేని చెర్రీ.. ఆ విజయాన్ని అలానే కంటిన్యూ చేయాలంటే కచ్చితంగా హిట్ దర్శకుడు కావాలని భావించి ఆ అవకాశం కొరటాలకే ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: మెగాస్టార్ చేయలేనిది.. పవర్ స్టార్ చేస్తున్నాడు!

Related Tags