Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ సెక్రటరియేట్లో ఒక విభాగానికి సీల్. అందులో పనిచేసే అధికారికి కోవిడ్-19 పాజిటివ్. శానిటైజ్ చేయడం కోసం కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు.
  • దేశ రాజధాని ఢిల్లీలో చిరు జల్లులు. వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రత నుంచి ఊరట. రానున్న 3 రోజుల్లో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రత. గత 4 రోజులుగా రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు. ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.
  • కరీంనగర్ పట్టణం కిసాన్ నగర్ లో దారుణం.. కన్నతల్లికి కరోనా ఉందంటూ ఇంట్లో నుండి గెంటేసిన కన్న కొడుకులు. ఇటీవలే మహారాష్ట్ర స్టేట్ షోలాపూర్ నుండి కరీంనగర్ కు వచ్చిన తల్లి శ్యామల. కరోనా లేకపోయినా కొడుకులు ఇంట్లో నుండి గెంటి వేయడంతో ఇంటి బయటే రోడ్డు మీద కూర్చొని ఉన్న వృద్ధురాలు. ఇంట్లో నుండి గెంటివేసిన కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు.
  • విశాఖ: కోవిడ్ నకిలీ పాసుల కేసు. డీజీ ఆఫీస్ నుంచి పోలీసులు జారీచెసే వాహనాల పాసులను సృష్టిస్తున్న మాయగాళ్ళు. ఒరిజినల్ పాస్ స్కాన్ చేసి.. వివరాలు మార్చి సొమ్ముచేసుకుంటున్న కేటుగాళ్ళు. ఒక్కోపాసు 3 నుంచి 6 వేలకు అమ్మకాలు.
  • పుల్వామాలో ఉగ్రదాడికి కుట్ర చేసిన వ్యక్తిని గుర్తించిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు. పేలుడు పదార్థాలను అమర్చిన కారు హిదయతుల్లా మాలిక్‌కు చెందినదని పోలీసులు వెల్లడి. నిందితుడిని షోపియాన్‌కు చెందిన హిదయతుల్లాగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడి. హిజుబుల్‌ ముజాహిద్దీన్‌లో హిదయతుల్లా చేరినట్లు సమాచారం.
  • తెలంగాణ కల సాకారమయ్యింది. తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్‌ ఓ ఉజ్వలఘట్టం. నిర్వాసితుల త్యాగాల వల్లే ప్రాజెక్టు సాధ్యమయ్యింది. నిర్వాసిత గ్రామాల యువతకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఉద్యోగాలు.

Ram Charan: కన్ఫ్యూజన్‌లో రామ్ చరణ్‌..!

టాలీవుడ్ స్టార్ హీరోలు జోరును పెంచేస్తున్నారు. ఒకప్పటిలా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా.. వెంట వెంటనే సినిమాలు చేయాలని భావిస్తున్నారు. అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే., మరో మూవీని ప్రకటించేస్తున్నారు.
Ram Charan movie news, Ram Charan: కన్ఫ్యూజన్‌లో రామ్ చరణ్‌..!

టాలీవుడ్ స్టార్ హీరోలు జోరును పెంచేస్తున్నారు. ఒకప్పటిలా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా.. వెంట వెంటనే సినిమాలు చేయాలని భావిస్తున్నారు. అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే., మరో మూవీని ప్రకటించేస్తున్నారు. అయితే అందరూ వరుస సినిమాలతో సిద్ధంగా ఉన్నా.. చెర్రీ మాత్రం ఇంకా కన్ఫ్యూజన్‌లో ఉన్నారట. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో స్టార్ నటుడు ఎన్టీఆర్‌తో కలిసి తొలిసారి నటిస్తున్నారు చెర్రీ. ఇక ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే తదుపరి సినిమాను ప్రకటించారు ఎన్టీఆర్. త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా తెరకెక్కుతుండగా.. ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ పూర్తి కాగానే అందులో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారు.

కానీ చెర్రీ మాత్రం ఇంకా కథలు వింటూనే ఉన్నారట. ఆ మధ్యన చిరు 152లో చెర్రీ నటించేందుకు డేట్లు ఇచ్చినప్పటికీ.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇక ఈ సినిమాను పక్కనపెడితే మరో దర్శకుడికి ఇంతవరకు చెర్రీ ఓకే చెప్పలేదు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కథను విన్న చెర్రీ బావుందని చెప్పారట. తాజాగా మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్‌ కూడా చెర్రీ ఓ కథను చెప్పగా.. మొత్తం స్క్రిప్ట్‌ను రెడీ చేసుకొని రమ్మారట. ఇక సుజీత్ కూడా రామ్ చరణ్‌కు ఓ కథను చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎంతమంది కథలు చెబుతున్నా కేవలం వింటున్న చెర్రీ.. ఇంకా ఎవ్వరికీ ఓకే చెప్పలేదని సమాచారం. మరి అసలు చెర్రీకి కథలు నచ్చడం లేదా..? లేక ఆర్ఆర్ఆర్‌ క్రేజ్‌ను కంటిన్యూ చేసేందుకు కొత్త స్క్రిప్ట్‌ కోసం వెతుకుతున్నారో..? ఆయనకే తెలియాలి. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Related Tags