Breaking News
  • మహబూబ్‌నగర్‌లో టెండర్‌ ఓటు నమోదు. 41వ వార్డులో 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదు. ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల ఆగ్రహం. ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు. రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం.
  • ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి-అంబటి. చట్టప్రకారం వాళ్లమీద యాక్షన్‌ తీసుకుంటాం-అంబటి. లోకేష్‌, చంద్రబాబు తాబేదారులు భూములు కొన్నారు-అంబటి.
  • కడప: ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌. రూ.2,68 లక్షలు స్వాధీనం.
  • ఏపీ హైకోర్టులో ఉత్కంఠ. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్ల కీలక విచారణ. వాదోపవాదాలు తెలుసుకోవటం కోసం వచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న.. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గి.
  • ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలి. మండలిలో జరిగేది ప్రజలకు తెలియకూడదనే ప్రసారాలు నిలిపేశారు. మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడవాలి. మండలి చైర్మన్‌కు అధికార పార్టీ నేతలు నరకం చూపించారు. బిల్లును హడావుడిగా ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డికి కౌన్సిల్‌లో ఏం పని. -ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌, బచ్చులఅర్జునుడు, సత్యనారాయణరాజు.

సానియాతో చెర్రీ డ్యాన్స్.. ఉపాసన ఏమందంటే..!

Mega Powerstar dance with bestie, సానియాతో చెర్రీ డ్యాన్స్.. ఉపాసన ఏమందంటే..!

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా వివాహం ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు అసద్‌తో ఆనమ్ నిఖా చేసుకుంది. పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ఇక ఈ వివాహానికి టాలీవుడ్ హీరో రామ్ చరణ్ దంపతులు కూడా వెళ్లారు. ఇక వేడుకల్లో భాగంగా సానియా మీర్జా, బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్‌తో  చెర్రీ డ్యాన్స్ వేశాడు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ నటించిన ‘వార్’ చిత్రంలోని ‘గుంగ్రూ’ అనే పాటకు ఈ ముగ్గురు డ్యాన్స్ వేశారు. ఇక దానికి సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘‘దీన్నే డ్యాన్స్‌తో ఫ్లోర్‌ను అదరగొట్టడం అంటారు’’ అని కామెంట్ పెట్టింది. ఇక ఈ వీడియోకు అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే రామ్ చరణ్ దంపతులకు సానియా మీర్జా మంచి స్నేహితురాలు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు అప్పుడప్పుడు విదేశీ యాత్రలకు కూడా వెళ్తుంటారు.

కాగా ప్రస్తుతం రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే 70శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు చెర్రీ.