మరోసారి తెరపైకి పవన్-చరణ్ ప్రాజెక్ట్.. నిజమెంత!

Ram Charan And Pawan Kalyan, మరోసారి తెరపైకి పవన్-చరణ్ ప్రాజెక్ట్.. నిజమెంత!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక సినిమాల్లో నటించకూడదని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమిపాలైనా.. మరో పదేళ్ల లక్ష్యంతో రాజకీయాల్లో కొనసాగుతానని పవన్ అభిమానులకు మాట ఇచ్చాడు.

మరి రాజకీయాల్లో కొనసాగాలంటే డబ్బులు కావాలి.? యాక్టింగ్ చేయకపోతే ఖర్చులు ఎలా వస్తాయి.? అందుకే పవన్ కళ్యాణ్ సినిమా నిర్మాణ రంగంపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నాడట. పవన్ కళ్యాణ్‌కు ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉంది. ఆ బ్యానర్‌పై ఇకపై సినిమాలను నిర్మించి.. నిర్మాణ బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ హీరోగా తన బ్యానర్‌పై ఓ సినిమాను నిర్మిస్తానని పవన్ కళ్యాణ్ ఏడాదిన్నర క్రితమే ప్రకటించాడు. అయితే కొన్నాళ్లుగా ఈ ప్రాజెక్ట్ గురించి ఏ వార్త రాకపోవడంతో అభిమానులు సైలెంట్ అయ్యారు. ఇకపోతే తాజాగా ఈ ప్రాజెక్ట్ మరోసారి వార్తలలో నిలిచింది. పవన్ కళ్యాణ్ తన మిత్రుడైన త్రివిక్రమ్‌ను.. రామ్ చరణ్ కోసం మంచి కథను సిద్ధం చేయమన్నట్లు సమాచారం. 2020లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుందని ఇండస్ట్రీ టాక్. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో బిజీగా ఉండ‌గా, త్రివిక్ర‌మ్.. బ‌న్నీ 19వ‌చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

తన ఫ్యామిలీ హీరోలతో కాదు కొత్త టాలెంట్‌తో కూడా సినిమాలు నిర్మించాలనేది జనసేనాని ప్లాన్. కొంత గ్యాప్ తీసుకుని.. నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ సెట్ చేస్తాడట. ఆ విధంగా పవన్ కళ్యాణ్‌కి ఆదాయం ఉంటుంది, సినిమా ఇండస్ట్రీతోనూ టచ్ పోదు. అందుకే ఈ ప్లాన్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *