Breaking News
  • గోబ్యాక్ అంటూ చంద్రబాబును వెనక్కిపంపింది ప్రజలే-గుడివాడ అమర్‌నాథ్. చంద్రబాబును అడ్డుకుంది వైసీపేనని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పులివెందుల నుంచి ఒక్క వ్యక్తి అయినా వచ్చారని నిరూపిస్తే.. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. లేదంటే లోకేష్‌ రాజీనామా చేయాలి-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌.
  • ప.గో: కుక్కునూరు మండలం వేలేరు చెక్‌పోస్ట్‌ దగ్గర పోలీసుల తనిఖీలు, 36 మద్యం బాటిళ్లు, ఒక బొలేరో వాహనం స్వాధీనం, వ్యక్తి అరెస్ట్‌.
  • విశాఖలో చంద్రబాబు పర్యటనపై హైకోర్టులో విచారణ. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల వ్యవహారంపై ఫిర్యాదు చేస్తూ.. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేసిన మాజీ ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్‌. చంద్రబాబు పట్ల పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్‌. రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ, విశాఖ పోలీస్‌ కమిషనర్‌.. ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చిన పిటిషనర్‌ శ్రవణ్‌కుమార్. తీవ్రమైన నేరాలకు ఇచ్చే సెక్షన్‌ 151 కింద.. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టిన సీజే. సెక్షన్‌ 151 కింద చంద్రబాబుకు నోటీసులు ఎలా ఇస్తారు. దీనిపై సమగ్ర అఫిడవిట్‌ ఫైల్‌ చేయాలని డీజీపీకి హైకోర్టు ఆదేశం. విచారణను మార్చి 2కు వాయిదా వేసిన హైకోర్టు.
  • విశాఖలో విషాదం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భానుప్రకాష్‌ అనే బాలుడు మృతి. బాలుడి మరణవార్తను తట్టుకోలేక బాబాయ్‌ చిరంజీవి ఆత్మహత్య. ఆస్పత్రిలో భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న చిరంజీవి.
  • రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మున్సిపల్‌ కమిషనర్ల సమావేశం. పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ప్రజలను రెచ్చగొట్టడమే చంద్రబాబు పని-నారాయణస్వామి. చంద్రబాబు పిచ్చిపట్టి మాట్లాడుతున్నారు. విశాఖలో చంద్రబాబు కాన్వాయ్‌పై ఎలాంటి దాడి జరగలేదు. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రజా చైతన్య యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు-నారాయణస్వామి.
  • వరసుగా బయటకు వస్తున్న రేవంత్ రెడ్డి భూ బాధితులు. రాజేంద్రనగర్‌ ఆర్డీవో కార్యాలయానికి క్యూ కడుతున్న బాధితులు. గోపన్‌పల్లి 127,128 సర్వే నెంబర్లతో పాటు మరో సర్వేలోనే కబ్జా చేశారని ఆరోపణలు. 124 సర్వే నెంబర్‌లోని భూమిని కూడా కబ్జా చేశారని బయటకు వచ్చిన బాధితులు. 124 సర్వే నెంబర్‌లో రెండు ఎకరాల భూమిని గంగధార రెడ్డి అనే అనుచరుడితో విలువలైన భూములను కొండల్‌రెడ్డి కబ్జా చేశాడని చెబుతున్న బాధితులు. రేవంత్‌ రెడ్డి, కొండల్ రెడ్డి అనుచరులు కబ్జా చేశారని ఆర్డీవో కు ఫిర్యాదు చేసిన బాధితులు. తమ భూమిని రేవంత్ రెడ్డి అనుచరులు కాజేశారని ఆర్డీవోకు విన్నపించుకున్న బాధితులు. ప్లాంట్ల దగ్గరకు వెళ్తే కొండల్ రెడ్డి అనుచరలతో దాడి చేస్తున్నారని వాపోతున్న బాధితులు. బాధితుల ఇచ్చిన భూ పత్రాలను పరిశీలిస్తున్న ఆర్డీవో.