ఆ సినిమాను, పాత్రను ఇప్పటికీ మిస్ అవుతున్నాః రకుల్

‘కెరటం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తన అందం, అభినయంతో చాలామంది అభిమానులను సొంతం చేసుకుంది. అటు ఫిట్‌నెస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. సొంతంగా బిజినెస్‌లో కూడా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో తన లక్‌ను పరీక్షించుకుంటోంది. హైదరాబాద్ తనకు రెండు ఇల్లు అంటున్న ఈ అందాల ముద్దుగుమ్మ.. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. భాగ్యనగరాన్ని బాగా మిస్ అవుతున్నా… రకుల్: నాన్న […]

ఆ సినిమాను, పాత్రను ఇప్పటికీ మిస్ అవుతున్నాః రకుల్
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 7:45 PM

‘కెరటం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తన అందం, అభినయంతో చాలామంది అభిమానులను సొంతం చేసుకుంది. అటు ఫిట్‌నెస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. సొంతంగా బిజినెస్‌లో కూడా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో తన లక్‌ను పరీక్షించుకుంటోంది. హైదరాబాద్ తనకు రెండు ఇల్లు అంటున్న ఈ అందాల ముద్దుగుమ్మ.. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

భాగ్యనగరాన్ని బాగా మిస్ అవుతున్నా…

రకుల్: నాన్న సైన్యంలో పని చేస్తుండటం వల్ల చాలా ప్రాంతాలు తిరగాల్సి వచ్చేది. ఆ తరుణంలోనే హైదరాబాద్‌తో అనుబంధం ఏర్పడింది. ఢిల్లీ సొంత ఊరు అయినా.. నాకు హైదరాబాద్‌లో చాలామంది స్నేహితులు ఉన్నారు. ముఖ్యంగా మంచు లక్ష్మీ క్లోజ్ ఫ్రెండ్. దాదాపు 50 రోజుల పాటు షూటింగ్ నిమిత్తం విదేశాలు వెళ్లి.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చినప్పుడల్లా ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది.

చిన్న చిన్న ఆనందాలను కోల్పోతున్నా…

రకుల్: సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత లైఫ్‌లో ఉండే చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోవాల్సి వస్తుంది. వ్యక్తిగతం అనేది ఉండదు.. అంతా బహిర్గతమే.. కొన్నిసార్లు ఫ్యాన్స్ చేసే విమర్శలు కూడా భరించాల్సి వస్తుంది. అంతేకాకుండా బయటికి షాపింగ్‌కి వెళ్లాలన్న ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇన్నీ బాధలు ఉన్నా.. ప్రేక్షకులు చూపించే అభిమానం ముందు ఒక్కసారిగా అవన్నీ మాయమయిపోతాయి.

క్రిమినల్ లాయర్‌గా…

రకుల్: త్వరలో నితిన్‌తో చేయబోయే సినిమాలో క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు. ప్రస్తుతం హిందీలో నాలుగు సినిమాలు చేస్తున్నా… తమిళంలో కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో కూడా నటిస్తున్నా..

వ్యాపారాన్ని తప్పకుండా విస్తరిస్తా…

రకుల్: ప్రస్తుతం విశాఖపట్నంలో ఒకటి.. హైదరాబాద్‌లో రెండు ఫిట్‌నెస్ సెంటర్స్ ఉన్నాయి. సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్ల సరిగ్గా దృష్టి సారించటలేదు గానీ.. త్వరలోనే తప్పకుండా వాటిని విస్తరించాలనే ఆలోచనలో మాత్రం ఉన్నాను.

ఆ సినిమాను మిస్ కావడం ఇప్పటికీ బాధిస్తోంది…

రకుల్: విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమాలో హీరోయిన్‌గా మొదట నన్నే సంప్రదించారు. కానీ అప్పటికే ‘దే దే ప్యార్ దే’ చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేయడంతో.. ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. అయితే ‘గీత గోవిందం’ సినిమా చూసిన ప్రతీసారి విజయ్ సరసన నేను నటిస్తే బాగుండేదని అనిపిస్తుంది.

ఏపీలో చల్ల.. చల్లగా.! 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
ఏపీలో చల్ల.. చల్లగా.! 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ విగ్రహాన్ని పెళ్లి చేసుకున్న యువతి..
శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ విగ్రహాన్ని పెళ్లి చేసుకున్న యువతి..
చెన్నైకే కాదు, శాంసన్‌కు ఇచ్చిపడేసిన లక్నో సారథి
చెన్నైకే కాదు, శాంసన్‌కు ఇచ్చిపడేసిన లక్నో సారథి
శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!
శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.