హీరోయిన్లు పొగ తాగితే తప్పేంటి.. రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆగష్టు 9న విడుదల కానున్న మన్మథుడు 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రకుల్ విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగు పాటలు, సీన్లు ఉన్న పాత్రల కంటే.. నటనకు ఆస్కారం ఉన్న విభిన్న పాత్రలలో నటించడానికే తాను ఇష్టపడతానని చెప్పారు. మన్నథుడు 2 సినిమాలో నటించడం తనకు మంచి అనుభవం అని చెప్పారు. షూటింగ్ సమయంలో నాగార్జున గారు మంచి సపోర్టు […]

హీరోయిన్లు పొగ తాగితే తప్పేంటి.. రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్..
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2019 | 9:05 PM

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆగష్టు 9న విడుదల కానున్న మన్మథుడు 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రకుల్ విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగు పాటలు, సీన్లు ఉన్న పాత్రల కంటే.. నటనకు ఆస్కారం ఉన్న విభిన్న పాత్రలలో నటించడానికే తాను ఇష్టపడతానని చెప్పారు. మన్నథుడు 2 సినిమాలో నటించడం తనకు మంచి అనుభవం అని చెప్పారు. షూటింగ్ సమయంలో నాగార్జున గారు మంచి సపోర్టు అందించారని తెలిపారు. హీరో, హీరోయిన్ పాత్రలే కాదు అందరి పాత్రలు బలంగా ఉండేలా ఈ సినిమాని నిర్మించారని రకుల్ అన్నారు.

ఈ సినిమాలో తాను 25 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తానని రకుల్ చెప్పారు. ట్రైలర్‌లో తాను పొగ తాగుతూ కనిపించానని.. దీనిపై పెద్ద చర్చే జరిగిందన్నారు. స్క్రీన్ పై అలాంటివి చెప్పినప్పుడు చేయాల్సి వస్తుంది. రియల్ లైఫ్ లో నేను స్మోకింగ్ చేయను. ప్రేక్షకులు ఇలాంటివి ఎందుకు జీర్ణించుకోలేరు. బయట చాలామంది స్మోకింగ్ చేస్తున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడరు. హీరో పొగతాగితే తప్పంటారు. అదే హీరోయిన్ తాగితే తప్పు ఎలా అవుతుందని రకుల్ ఫైర్ అయ్యారు.