Rakul Preet Singh Recovers: రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా నెగిటీవ్.. ట్విటర్ ద్వారా వెల్లడించిన ఢిల్లీ బ్యూటీ.. జాగ్రత్త అంటూ హితవు..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా మహమ్మారిని జయించింది. తాజాగా జరిపిన కరోనా టెస్ట్‌లో తనకు నెగెటీవ్‌ వచ్చిందని .

Rakul Preet Singh Recovers: రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా నెగిటీవ్.. ట్విటర్ ద్వారా వెల్లడించిన ఢిల్లీ బ్యూటీ.. జాగ్రత్త అంటూ హితవు..
Follow us

|

Updated on: Dec 29, 2020 | 4:14 PM

Rakul Preet Singh Recovers: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా మహమ్మారిని జయించింది. తాజాగా జరిపిన కరోనా టెస్ట్‌లో తనకు నెగెటీవ్‌ వచ్చిందని రకుల్ తెలిపింది. ఈ విషయమై ట్వీట్ చేసిన రకుల్.. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొంది. ”మీ ప్రేమాభిమానాల వల్లే నేను ఇంత త్వరగా కోలుకున్నాను. అందరి ప్రేమకు కృతజ్ఞతలు. 2021 సంవత్సరం మంచి ఆరోగ్యంతో ప్రారంభించేదుకు సిద్ధమవుతున్నా” అంటూ రకుల్ ట్వీట్ చేసింది. అంతేకాదు.. స్వీయ అనుభవం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది రకుల్. మాస్క్‌లను విధిగా ధరించాలని, కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించండి అంటూ రకుల్ అతన ఫ్యాన్స్‌కు జాగ్రత్తలు తెలిపింది. కాగా, ఈనెల 22వ తేదీన తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు రకుల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. దాంతో రకుల్ క్వారంటైన్‌లో చికిత్స పొందింది. వారం రోజుల్లోనే కరోనాను జయించింది. కాగా, ఆరోగ్యం పరంగా తీసుకునే చర్యల కారణంగానే రకుల్ ఇంత త్వరగా కోలుకుందని అభిమానులు అంటున్నారు.

కాగా, ఈ ఢిల్లీ భామ ప్రస్తుతం తెలుగులో రాబోయే రెండు సినిమాల్లో నటిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో హీరో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు సమాచాం. మరోవైపు హీరో నితిన్ తోనూ ఓ సినిమాలో అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

Also read:

భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్.. హృద‌యానికి హద్దుకుంటోన్న ‘ఆహా’ సామ్‌జామ్ కొత్త ప్రోమో..

తెలుగు బిగ్ బాస్ 4: ఎఫ్3లో అభిజిత్‌కు కీలక పాత్ర.. అసలు ఇందులో నిజమెంత.!!