రకుల్‌కు బంపర్ ఆఫర్..?

రకుల్ ప్రీత్ సింగ్‌ బంపర్‌ ఆఫర్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా కమల్ హాసన్‌ సినిమాలో నటించే అవకాశాన్ని పొందినట్లు సమాచారం. కమల్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘భారతీయుడు 2’లో రకుల్‌కు ఆఫర్ వచ్చిందట. ఆ మూవీలో కమల్ సరసన కాజల్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక నటుడు సిద్దార్ధ్ మరో కీలక పాత్రలో కనిపించనుండగా.. ఆయన సరసన రకుల్ నటించనుందట. ఒకవేళ ఇదే నిజమైతే ఆమెకు బంపర్‌ ఆఫర్ వచ్చినట్లే. ఇక ఆమెతో పాటు ఐశ్వర్యా రాజేష్, ప్రియా భవానీ శంకర్ కూడా ముఖ్య పాత్రలలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే నెల 19న రాజమండ్రిలో ప్రారంభించాడనికి టీమ్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.

కాగా 1996లో వచ్చి విజయం సాధించిన ఇండియన్ సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ మూవీ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక సమస్యతో షూటింగ్‌లో ఆలస్యమవుతూ వస్తోంది. ఈ క్రమంలో సినిమా ఆగిపోయినట్లు కూడా వార్తలు వినిపించాయి. అయితే వాటన్నింటికి తెరదించుతూ తదుపరి షెడ్యూల్‌కు సిద్ధమౌతుంది చిత్ర యూనిట్. వచ్చే ఏడాది ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

కాగా ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం కమల్ హాసన్ బిగ్‌బాస్ 3కు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షో పాటు ఇండియన్ 2 సినిమాలోనూ ఆయన పాల్గొనబోతున్నాడు. వాటితో పాటు 2015లో ప్రకటించిన తలైవన్ ఇరుక్కిండ్రాన్‌ చిత్రీకరణను ప్రారంభించనున్నాడు కమల్.

మరోవైపు నాగార్జున సరసన రకుల్ నటించిన మన్మధుడు విడుదలకు సిద్ధమైంది. వీటితో పాటు తమిళ్‌లో శివ కార్తికేయన్ సరసన ఓ సినిమాలో, హిందీలో సిద్దార్థ్ మల్హోత్రా సరసన మర్జావాన్‌లో నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *