ఇన్​స్టాగ్రామ్​లో రకుల్ దూకుడు : క్రేజీ ఫీట్

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌...తమిళ, హిందీ ప్రేక్షకుల్ని మెప్పించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఎన్నో రకాల వీడియోలను అప్‌లోడ్ చేసి నెటిజ‌న్ల అభిమానాన్ని చూర‌గొంది.

ఇన్​స్టాగ్రామ్​లో రకుల్ దూకుడు : క్రేజీ ఫీట్
Follow us

|

Updated on: Aug 05, 2020 | 11:40 PM

Rakul Preet Singh hits 15 million followers on Instagram :ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌…తమిళ, హిందీ ప్రేక్షకుల్ని కూడా మెప్పించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఎన్నో రకాల వీడియోలను అప్‌లోడ్ చేసి నెటిజ‌న్ల అభిమానాన్ని చూర‌గొంది. నిత్యం సోష‌ల్ మీడియాలో సందడి చేసే ఈ సుంద‌రాంగి..తాజాగా మ‌రో ఫీట్ సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 15 మిలియన్ల ఫాలోవర్స్​ను సంపాదించింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెష‌ల్ వీడియోను షేర్‌ చేసింది.

“చిన్నతనంలోనే యాక్టింగ్ స్టార్ట్ చేశా. అసలు అప్పుడు నేను చేస్తున్న వ‌ర్క్ ఏంటో, నా స్కిల్స్ ఏంటో, ఈ సామాజిక మాధ్యమాల ఏంటో తెలీదు. కానీ మీరందరూ నేను ఈ స్థాయికి చేరుకోడానికి సహాయసహకారాలు అందించారు. ఎప్పుడూ నాపై అపారమైన ప్రేమ కురిపిస్తూనే ఉన్నారు. ఈ ప్రేమను నేను ఎప్పటికి మర్చిపోను. మీకు రుణ‌ప‌డి ఉంటా. మీ అందరిని అలరించడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటానని మాట ఇస్తున్నా. మీరు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. ఇక్కడ ఇంతమంది ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఉన్నారు. ఏ సంతోష‌మైనా మీతోనే పంచేకుంటున్నా” అని రకుల్ ప్రీత్ పేర్కొంది.

రకుల్ ప్రీత్‌సింగ్ ప్రస్తుతం కమల్‌హాసన్‌తో కలిసి ‘భారతీయుడు 2’ సినిమాలో నటిస్తోంది. హిందీలో అజయ్ దేవ్‌గన్, సిద్దార్థ్ మల్హోత్రా కలిసి ‘థాంక్స్ గాడ్’ అనే కామెడీ మూవీ చేస్తోంది.

Also Read  : రియా చక్రవర్తికి ఈడీ సమన్లు