రష్మిక మాజీ ప్రేమికుడు.. రంగస్థలంలో కొత్త ఆటగాడు!

కన్నడ హీరో అని చెప్పడం కంటే హీరోయిన్ రష్మిక మందన్నా మాజీ ప్రేమికుడు అంటే తెలుగువారికి బాగా అర్ధమవుతుంది. అతనెవరో కాదండీ.. రక్షిత్ శెట్టి. ప్రస్తుతం ఈయన ‘అవనే శ్రీమన్నారాయణ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రక్షిత్ శెట్టి అండ్ ది సెవెన్ ఆడ్స్ కథ అందిస్తున్న ఈ సినిమాకు సచిన్ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ మూవీ ఐదు భాషల్లో విడుదల అవుతుండగా.. తెలుగులో ‘అతడే శ్రీమన్నారాయణ’ పేరుతో విడుదల కానుంది. కౌబాయ్ జోనర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ […]

రష్మిక మాజీ ప్రేమికుడు.. రంగస్థలంలో కొత్త ఆటగాడు!
Follow us

| Edited By:

Updated on: Nov 29, 2019 | 12:02 AM

కన్నడ హీరో అని చెప్పడం కంటే హీరోయిన్ రష్మిక మందన్నా మాజీ ప్రేమికుడు అంటే తెలుగువారికి బాగా అర్ధమవుతుంది. అతనెవరో కాదండీ.. రక్షిత్ శెట్టి. ప్రస్తుతం ఈయన ‘అవనే శ్రీమన్నారాయణ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రక్షిత్ శెట్టి అండ్ ది సెవెన్ ఆడ్స్ కథ అందిస్తున్న ఈ సినిమాకు సచిన్ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ మూవీ ఐదు భాషల్లో విడుదల అవుతుండగా.. తెలుగులో ‘అతడే శ్రీమన్నారాయణ’ పేరుతో విడుదల కానుంది. కౌబాయ్ జోనర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని కొద్దిసేపటి క్రితం విడుదల చేశాడు. సుమారు నాలుగు నిముషాలు నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో మొత్తం స్టోరీలైన్‌ను వివరించేశారు.

దక్షిణాదిన ఒక ఊహాజనిత పట్టణం.. ఆ ఊరిలో బందిపోటులదే రాజ్యం. ఇక అక్కడ ఉన్న ఒక పవర్‌ఫుల్ వ్యక్తి జయరాముడు నిధిని ఎవరో దొంగిలిస్తారు. దీంతో జయరాముడు ఆ నిధిని ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. అంతేకాక నిధిని ఎత్తుకెళ్లిన దొంగ.. అతని ఫ్యామిలీని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అడ్డు వచ్చినవారిని చంపుకుంటూ వెళ్తున్న జయరాముడికి.. హీరో శ్రీమన్నారాయణ(పోలీస్ ఆఫీసర్) హెల్ప్ చేస్తాడు. జయరాముడికి హీరో ఎందుకు సహాయం చేస్తున్నాడు.? చివరికి ఆ దొంగ దొరికాడా.? అసలు ఆ నిధి విషయంలో వీళిద్దరి మధ్య హీరో ఎందుకు వేలు పెట్టాడు అనేది మిగతా కథ.

ప్యాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. రక్షిత్ స్టైల్, స్వాగ్… అజనీష్ లోకనాథ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. స్టంట్స్ ఇలా ఒకటేమిటి.. ట్రైలర్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ‘అతడే శ్రీమన్నారాయణ’ ఫుల్ మీల్స్ సినిమా అని చెప్పొచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఆలస్యం ఎందుకు రష్మిక మాజీ ప్రేమికుడి విశ్వరూపాన్ని మీరు కూడా చూసేయండి.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.