రక్షా బంధనంలో రాజకీయ నేతలు.. వెల్లువెత్తనున్న అభిమానులు

Raksha Bandhan 2019: This is How Indian Politicians Celebrate Rakhi

అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల.. ప్రేమకు ప్రతి రూపంగా ‘రాఖీ’ పండుగను జరుపుకుంటాం. రాఖీ పురాతన సంప్రదాయం. అసలు ఈ సంప్రదాయం మొదట ఉత్తర ఇండియా నుంచి వచ్చింది. బయటకు వెళ్లిన వారు క్షేమంగా.. సురక్షితంగా ఇంటికి రావాలని కోరుతూ.. రక్షాబంధన్‌గా ఈ రాఖీని కడతారు. ఇది మొదట.. భార్య భర్తకు కడుతూ వచ్చేవారు. కానీ.. ఇది రాను రానూ.. అన్నా చెల్లెళ్ల పండుగగా మారింది.

ఈ ఏడాది ఆగష్టు 15, రాఖీ పండుగ రెండూ ఒకే రోజు రావడంతో.. ఇటు.. దేశభక్తితో జాతీయ జెండా ఎగురవేసి, అటు రక్షగా రాఖీ పండుగ కూడా జరుపుకోవడం విశేషం.

1.మోదీ: ఈ పండుగలో భాగంగా.. మోదీకి 22 ఏళ్ల సంవత్సరాలుగా.. ఓ పాకిస్తాన్ మహిళ రాఖీ పంపిస్తూ.. వస్తోంది. ఖమర్ మోసిన్ షేక్ అనే మహిళ.. ఆయన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచీ ఆమె మోదీకి రాఖీ కడుతూ వస్తున్నారు. ఈ సందర్భంగా.. మోదీ.. కార్యకర్తగా ఎలా ఉన్నారో.. ప్రధాని అయ్యాక కూడా ఒకేళా ఉన్నారని ఖమర్ పేర్కొన్నారు. కాగా.. అలాగే.. మోదీ.. స్థానిక మహిళలు, పలు పార్టీల మహిళలు కూడా రాఖీ కడుతూ వస్తూన్నారు.

2.అమిత్‌ షా: ఇటీవలే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అఖండ విజయం సాధించి పెట్టిన అమిత్‌ షా ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితులు. పార్టీ అధ్యక్షునిగా ఆ తరువాత కేంద్ర హోంమంత్రిగా ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్న అమిత్‌ షా.. తాజాగా.. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిని కల్పిస్తున్న 370 ఆర్టికల్ రద్దు విషయంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. అమిత్‌ షా కూడా పలువురు కేంద్ర మహిళా మంత్రులు, పార్టీ కార్యకర్తలు, స్థానికులు రాఖీ కట్టనున్నారు.

3.వెంకయ్యనాయుడు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు.. అత్యంత ఆప్త మిత్రుడు. అందరితోనూ హందాగా వ్యవహరిస్తారు. చక్కటి వాక్చాతుర్యం గల వ్యక్తి. వెంకయ్యనాయుడికి కూడా పలువురు కేంద్ర మహిళా మంత్రులు రాఖీ కడుతూంటారు, పార్టీ కార్యకర్తలు కూడా కొన్ని ప్రదేశాల నుంచి రాఖీ పంపిస్తారు.

4.చంద్రబాబు నాయుడు: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ సంవత్సరం మొదటిసారిగా మాజీ మంత్రి సునీత, సీతక్క రాఖీలు కట్టారు. అస్వస్థతగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌ నివాసంలోని విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడకు వెళ్లి సునీత, సీతక్క రాఖీ కట్టి.. చంద్రబాబుకు స్వీట్లు తినిపించారు. ఆయన ఆరోగ్యం బావుండాలని.. కోరుకున్నట్లు వారు తెలిపారు. ఇటీవలే చంద్రబాబు తన ఆరోగ్యం కోసం అమెరికాలో మెరుగైన వైద్య చికిత్స చేయించుకుని తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.

5.జగన్మోహన్ రెడ్డి: 2019 ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిని జగన్ చేపట్టారు. ఆయనకు తన చెల్లెలు షర్మిళా ప్రతీ సంవత్సరం రాఖీ కడుతూంటారు. అలాగే.. ముఖ్యంగా నగరి ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు పార్టీ మహిళా నేతలు కూడా జగన్‌కు రాఖీ కడుతూండటం తెలిసిన విషయమే.

6.కేసీఆర్: 2018 ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్ అధికారం చేపట్టారు. ఆయనకు పలువురు స్థానిక మహిళలు రాఖీ కడుతూంటారు. అలాగే.. ఇతర ప్రదేశాల నుంచి కూడా ఆయన అభిమానులు రాఖీలు పంపిస్తూంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *