రాజస్తాన్ పై బీజేపీ కన్ను.. సీఎం అశోక్ గెహ్లాట్ ఫైర్

తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలూ చేస్తోందని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల్లో తమ (బీజేపీ) బేరసారాలు పూర్తి కాకపోవడంవల్లే రాజ్యసభ...

రాజస్తాన్ పై బీజేపీ కన్ను.. సీఎం అశోక్ గెహ్లాట్ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 11, 2020 | 4:33 PM

తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలూ చేస్తోందని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల్లో తమ (బీజేపీ) బేరసారాలు పూర్తి కాకపోవడంవల్లే రాజ్యసభ ఎన్నికలను కావాలని రెండు నెలలు జాప్యం చేశారని ఆయన అన్నారు. నిజానికి ఈ ఎన్నికలను రెండు నెలల క్రితమే నిర్వహించి ఉండవచ్ఛు.. కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల’ కొనుగోలు’, ‘విక్రయాలను’ పూర్తి చేయనందునే వీటిని జాప్యం చేశారు’ అని ఆయన దుయ్యబట్టారు. ఇక త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. కానీ పరిస్థితిలో మార్పు లేదని వ్యాఖ్యానించారు.  బేరసారాలతో రాజకీయాలు ఎంతకాలం కొనసాగిస్తారని గెహ్లాట్ ప్రశ్నించారు.అటు- ఈ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఏసీబీకి ఫిర్యాదు చేశారు.  తమ ఎమ్మెల్యేలను వారు ప్రలోభపెడుతున్నారని, ఒక్కొక్కరికి కోట్ల కొద్దీ సొమ్ము ఇవ్వజూపుతున్నారని వారు పేర్కొన్నారు. తమ శాసనసభ్యులను బీజేపీ ‘ఎర’ నుంచి రక్షించుకునేందుకు వారిని ఓ రిసార్టుకు తరలించారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలను రాష్ట్ర బీజేపీ చీఫ్ సతీష్ పూనియా ఖండించారు. ఏళ్ళ తరబడి బేరసారాల పాలిటిక్స్ ఆడినవాళ్ళే మమ్మల్ని వేలెత్తి చూపుతున్నారని ఆయన అన్నారు. ఈ నెల 19 న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాజ్యసభ సీట్లను గెలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి తగినంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గెలుపు సాధించాలంటే ప్రతి అభ్యర్థికి 51 తొలి ప్రాధాన్యతా ఓట్లు అవసరం. అయితే ఇక్కడే బీజేపీ ఒక అభ్యర్థి బదులు ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టింది. దాంతో కాంగ్రెస్ పార్టీలో అనుమానాలు మొదలయ్యాయి. ఈ పార్టీకి 12 మంది ఇండిపెండెంట్లు మద్దతునిస్తున్నారు. కానీ వారు బీజేపీవైపు మళ్లితే అది కాంగ్రెస్ పార్టీకి దెబ్బే అవుతుంది. బీజేపీ లాభపడుతుంది.

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!

గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!

ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??