ఎన్ఎంసీ బిల్లుపై దేశవ్యాప్తంగా డాక్టర్ల ఆందోళన.. ఎందుకు ?

ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్ ) బిల్లుపై దేశవ్యాప్తంగా వేలాదిమంది డాక్టర్లు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ బిల్లు నిరంకుశమైనదని, వైద్య వృత్తిని దెబ్బ తీసేదిగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. (ఈ బిల్లును లోక్ సభ జులై 29 న, రాజ్యసభ ఆగస్టు 2 న ఆమోదించాయి). అసలు ఈ బిల్లులో ఏముంది ? డాక్టర్లు ఎందుకు దీనిపట్ల ఇంతగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ? వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతమున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా […]

ఎన్ఎంసీ బిల్లుపై దేశవ్యాప్తంగా డాక్టర్ల ఆందోళన.. ఎందుకు ?
Follow us

|

Updated on: Aug 04, 2019 | 12:31 PM

ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్ ) బిల్లుపై దేశవ్యాప్తంగా వేలాదిమంది డాక్టర్లు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ బిల్లు నిరంకుశమైనదని, వైద్య వృత్తిని దెబ్బ తీసేదిగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. (ఈ బిల్లును లోక్ సభ జులై 29 న, రాజ్యసభ ఆగస్టు 2 న ఆమోదించాయి). అసలు ఈ బిల్లులో ఏముంది ? డాక్టర్లు ఎందుకు దీనిపట్ల ఇంతగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ? వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతమున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ ) స్థానే నేషనల్ మెడికల్ కమిషన్ ని ఏర్పాటు చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. మెడికల్ ఎడ్యుకేషన్, ప్రొఫెషన్, దేశంలో వైద్య కళాశాలల రెగ్యులేషన్స్ కు సంబంధించిన అన్ని అంశాలనూ పూర్తిగా మార్చి ఉన్నత ప్రమాణాలను కల్పించాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది. వైద్య రంగంలో ఇదో పెద్ద సంస్కరణలకు సంబంధించిన చర్యగా, నిర్ణయంగా మోడీ ప్రభుత్వం పరిగణిస్తోంది. 63 ఏళ్లుగా ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై అవినీతి ఆరోపణలు తలెత్తడంతో… 1956 నాటి మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ను రద్దు చేయాలని ఇందులో ప్రతిపాదించారు. దేశంలో వైద్య కళాశాలలను హేతుబధ్ధం చేయడంలో ఇటీవలి కాలంలో జరుగుతున్న పొరబాట్లు, చోటు చేసుకుంటున్న లొసుగులను సరిదిద్దాలని ఇది నిర్దేశిస్తోంది. (ఈ బిల్లు పేదల, వైద్య విద్యార్థుల వ్యతిరేకి అని జూనియర్ డాక్టర్లు, డాక్టర్ల సంఘాలవారు ఆరోపిస్తున్నారు). మధ్య స్థాయిలో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లు (సీహెచ్పీఎస్) మెడిసిన్ ప్రాక్టీసు చేయడానికి లైసెన్స్ ఇచ్చి వారిని ప్రోత్సహించాలని ఇది సూచిస్తోంది. అయితే వీరిని ఏ రకమైన ప్రొఫెషనల్స్ గా గుర్తిస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు. వీరిని ప్రైమరీ-ప్రివెంటివ్ హెల్త్ కేర్ సెంటర్స్ లో స్వతంత్రంగా మందులను ప్రిస్క్రైబ్ చేసేందుకు అనుమతిస్తారు. అయితే ఉన్నత స్థాయిలో ఉన్న మెడికల్ ప్రాక్టిషనర్ల పర్యవేక్షణలోనే వీరు పని చేయాల్సి ఉంటుంది. ఇండియాలో వైద్య విద్యా ప్రమాణాలు ఏకరీతిన ఉండాలని కూడా ఈ బిల్లు సూచిస్తోంది. పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు, ప్రాక్టీసు లైసెన్సు పొందేందుకే కాకుండా పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ పేరిట గల కామన్ ఫైనలియర్ ఎంబీబీఎస్ పరీక్ష నిర్వహించాలని ఈ బిల్లు కోరుతోంది. ఫైనలియర్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ ని పీజీ కోర్సులకు ఎంట్రెన్స్ టెస్ట్ గా, విదేశీ మెడికల్ కళాశాలల నుంచి మెడిసిన్ లో గ్రాడ్యుయేట్ పట్టా పొందినవారికి స్క్రీనింగ్ టెస్ట్ గా పరిగణించాలని ఇది పేర్కొంటోంది. ‘ నీట్ ‘ ప్రవేశ పరీక్షగా కొనసాగుతుందని, ఎయిమ్స్ వంటి ఆసుపత్రులు దీనికి కట్టుబడి ఉంటాయని స్పష్టం చేస్తోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి విదేశాల్లో మెడిసిన్ చదివి పాసైనవారికి ప్రస్తుతం ఇండియాలో ప్రాక్టీసు చేసే అవకాశం ఉంది. కానీ కొత్త చట్టం ప్రకారం ఆ విద్యార్థులు కూడా నేషనల్ ఎగ్జిట్ టెస్టుకు హాజరు కావలసిందే. ఈ బిల్లు చట్టమైన మూడేళ్ళ లోగా కొత్త ఎగ్జిట్ పరీక్షా విధానాన్ని అమలు చేస్తారు. ఫీజుల రెగ్యులేషన్ కు సంబంధించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎలాంటి అధికారమూ లేదు. కొత్త బిల్లులో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోసీట్లలో 50 శాతం ఫీజును ఇది నిర్దేశిస్తోంది. అటు-తాము కొన్ని సవరణలు సూచిస్తున్నామని, వీటిని పాటించకపోతే దేశంలో వైద్య విద్యా ప్రమాణాలు దిగజారిపోతాయని డాక్టర్ల సంఘాలు హెచ్ఛరిస్తున్నాయి. నీట్-పీజీని రద్దు చేసి ఎగ్జిట్ పరీక్షను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది.