Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

చిరంజీవికి ‘రాజ్యసభ’ బెర్త్ కన్ఫామ్ అయ్యిందా..?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయల నుంచి తప్పుకుని చాలా కాలం అయ్యింది. అలాగే.. సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు. అయితే.. మళ్లీ ఇప్పుడు సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఒక్క సినిమాతో.. ఇప్పటికీ ఆయనంటే.. అభిమానుల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని ఫ్రూవ్ అయ్యింది. కాగా.. సడన్‌గా ఆయన ఏపీ సీఎం జగన్‌ను కలవడం అటు రాజకీయాల్లోనూ.. ఇటు.. తెలుగు ఇండస్ట్రీలోనూ.. హాట్ టాపిక్‌ అయ్యింది. అయితే.. వారి భేటీపై.. చాలా ఊహాగానాలు వచ్చాయి. ఎవరి ఊహకు అందినట్టు వారు వారి.. అనుమానాలను బయపెడుతున్నారు.

కాగా.. ఇప్పుడు మళ్లీ చిరంజీవి పాలిటిక్స్‌ వైపు చూస్తున్నారని..!! అందులో భాగమే.. సీఎం జగన్‌తో భేటీ కావడం వెనుక వున్న పాయింట్‌ అని అంటున్నారు. నిజానికి చిరంజీవి అందరివాడిలా ఉండాలనుకుంటారు. అయితే.. ఒకరి అవసరాలు.. మరొకరికి ఉన్నాయని.. అందుకే సినిమా వంక పెట్టుకుని వెళ్లి కలిశారని.. టాక్ వినిపిస్తోంది. అలాగే.. చిరంజీవి.. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో స్టూడియో నిర్మించాలని.. ఎప్పటినుంచో అనుకుంటున్నారట. అందులోనూ.. చిరు తనయుడు రామచరణ్ ఇప్పటికే.. కొణిదెల ప్రొడక్షన్స్ అని పెట్టి. వరుసపెట్టి సినిమాలు తీస్తున్నాడు. అయితే.. జగన్‌ను కలిసిన మెగాస్టార్.. ఏపీలోని స్టూడియో కోసం కూడా చర్చలు జరిపారట. అందుకు సీఎం కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం.

అలాగే.. ఇప్పుడున్న వారిలో చిరంజీవి టాలీవుడ్‌లో పెద్ద. అందులో.. ఆయనే స్వయంగా వచ్చి.. జగన్‌ను అభినందించి.. లంచ్‌ చేసి మరీ వెళ్లారు. దీంతో.. జగన్ చాలా సంతోషం వ్యక్తం చేశారట. ఇప్పటివరకూ.. టాలీవుడ్‌లో ఓ ఒక్క నటుడు కూడా.. జగన్‌ను అభినందించలేదు. కాగా.. జగన్.. ఏపీలో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలనుకుంటున్నారట. అందుకు చిరు కూడా సై అంటే.. ప్రభుత్వం నుంచి నామినేటడ్‌ పదవిలోనే నియమించి.. ఏపీలోనే టాలీవుడ్‌ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరుతారని అంటున్నారు. అందులోనూ.. వచ్చే ఏడాది మార్చిలో.. రాజ్యసభ సీట్లు పెద్ద ఎత్తున విడుదల కాబోతున్నాయి. అందులో అన్నింటినీ.. వైసీపీ గెలుచుకునే బలంతో ఉంది. దానికి కూడా చిరంజీవి ఓకే అంటే.. రాజ్యసభకు కూడా.. ఫిల్మ్‌స్టార్స్ కోటాలో పంపాలని వైసీపీ భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అటు చిరంజీవి వల్ల కొన్ని జిల్లాల్లో బలమైన స్థానాల్లో సామాజిక వర్గం పూర్తిగా టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా.. చిరుకు రాజ్యసభ సీటు కన్ఫామ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయన్నమాట.