తలాఖ్ బిల్లుపై వీగిపోయిన విపక్షాల తీర్మానం

Rajya Sabha Rejects Motion To Send Triple Talaq Bill To Select Panel, తలాఖ్ బిల్లుపై వీగిపోయిన విపక్షాల తీర్మానం

వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై ఓటింగ్ కొనసాగుతోంది. విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. బిల్లుపై చర్చ సందర్భంగా తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. బిల్లును వ్యతిరేకిస్తూ.. టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు తెలిపాయి. బీజేడీ బిల్లుకు మద్దతు తెలిపింది. అన్నాడీఎంకేతో పాటు జేడీయే కూడా సభ నుంచి వాకౌట్ చేసింది. కాగా బిల్లును సెలక్ట్ కమిటీకి పంపిచాలన్న విపక్షాల తీర్మానం వీగిపోయింది. ప్రభుత్వానికి అనుకూలంగా 100 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి.దీంతో విపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. దీంతో సభలో బీజేపీ బలం స్పష్టంగా కనిపిస్తోంది. బిల్లు ఆమోదం పొందడం ఖాయమైనట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *