రాజ్యసభ సభ్యుడు అరెస్ట్..కొన్ని గంటల్లోనే.. !

షెడ్యూల్ కులాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు ఆర్‌ఎస్ భారతిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజ్యసభ సభ్యుడు అరెస్ట్..కొన్ని గంటల్లోనే.. !
Follow us

| Edited By:

Updated on: May 23, 2020 | 8:43 PM

షెడ్యూల్ కులాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు ఆర్‌ఎస్ భారతిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత సంస్థ ఆది తమిజార్ పెరవై నాయకుడు అరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకు అలందూర్‌లోని నివాసంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 15న  కలైంజర్‌ రీడింగ్ సర్కిల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆర్ఎస్ భారతి.. ఎస్సీలను కించేపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అరెస్ట్‌ చేసిన తరువాత వైద్య పరీక్షల కోసం నిమిత్తం ఆయనను ఓ ఆసుపత్రికి తరలించారు.

ఈ సందర్భంగా ఆర్ఎస్ భారతి మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారని అన్నారు. ఈ వివాదంపై తరువాతి రోజే క్షమాపణ చెప్పానని ఆయన గుర్తు చేశారు. అయితే అవినీతి కేసులో డిప్యూటీ సీఎం ఓ పన్నీర్‌ సెల్వంపై  ఫిర్యాదు చేసినందుకు ప్రభుత్వం తనను అరెస్ట్ చేయించిందని ఆరోపించారు. ఇలాంటి వాటికి తాను భయపడనని, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం​ కొనసాగిస్తానని ప్రకటించారు. ఇదిలా ఉంటే ఆర్ఎస్ భారతికి ఎగ్మోర్ మేజిస్ట్రేట్ కోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అరెస్ట్ చేసి గంటలు కూడా గడవకముందే ఆయనను విడుదల చేశారు.

Read This Story Also: మాస్క్‌లతో జాగ్రత్త.. వారు వాడకపోవడమే మంచిదంటోన్న శాస్త్రవేత్తలు..!

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన