రాజ్య‌స‌భ నిర‌వ‌ధికంగా వాయిదా

రాజ్య‌స‌భ నిర‌వ‌ధికంగా వాయిదాప‌డింది. షెడ్యూల్ ప్ర‌కారం పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు అక్టోబ‌ర్ 1 వ‌ర‌కు జ‌రుగాల్సి ఉంది. కానీ, కోవిడ్ విస్తృతి నేప‌థ్యంలో స‌మావేశాల గ‌డువును వారం రోజులు కుదిస్తున్న‌ట్లు పార్ల‌మెంటు వ‌ర్గాలు తెలిపాయి.

రాజ్య‌స‌భ నిర‌వ‌ధికంగా వాయిదా
Follow us

|

Updated on: Sep 23, 2020 | 3:20 PM

రాజ్య‌స‌భ నిర‌వ‌ధికంగా వాయిదాప‌డింది. షెడ్యూల్ ప్ర‌కారం పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు అక్టోబ‌ర్ 1 వ‌ర‌కు జ‌రుగాల్సి ఉంది. కానీ, కోవిడ్ విస్తృతి నేప‌థ్యంలో స‌మావేశాల గ‌డువును వారం రోజులు కుదిస్తున్న‌ట్లు పార్ల‌మెంటు వ‌ర్గాలు తెలిపాయి.

ఈ నెల 14 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశాలు 18 రోజుల పాటు జరగాల్సి ఉన్నప్పటికీ 10 రోజులే జరిగాయని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ పది రోజుల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో 25 బిల్లులు ఆమోదం లభించగా.. ఆరు బిల్లులను ప్రవేశపెట్టినట్టు తెలిపారు.

ఈ సమావేశాల ఉత్పాదకత 100.47శాతంగా ఉందని అన్నారు. 198 మంది ఎంపీలు రాజ్యసభలో చర్చల్లో పాల్గొన్నారని, 1567 అన్‌స్టార్‌డ్‌ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్టు వెంకయ్య‌ వెల్లడించారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం రాజ్య‌స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. ఉద‌యం స‌భ ప్రారంభం కాగానే ప‌లు కీల‌క బిల్లుల‌కు స‌భ ఆమోదం తెలిపింది. విప‌క్షాల గైర్హాజ‌రీలోనే స‌భా కార్య‌క‌లాపాలు కొన‌సాగాయి. బుధవారం రాజ్య‌స‌భ ఆమోదించిన బిల్లుల్లో ఆక్యుపేష‌న‌ల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వ‌ర్కింగ్ కండిష‌న్స్ కోడ్-2020, ది ఇండ‌స్ట్రియ‌ల్ రిలేష‌న్స్ కోడ్‌-2020, అండ్ ది కోడ్ ఆన్ సోష‌ల్ సెక్యూరిటీ-2020 బిల్లులు, జ‌మ్ముక‌శ్మీర్ అధికారిక భాష‌ల బిల్లు-2020 ఉన్నాయి.అయితే అప్రాప్రియేష‌న్ (నెం.3) బిల్లు-2020, అప్రాప్రియేష‌న్ (నెం.4) బిల్లు-2020ల‌ను మాత్రం రాజ్య‌స‌భ తిప్పిపంపింది.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!