Breaking News
  • అమరావతి: ఏపిలో ఒకే రోజు 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం 40 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య.
  • మద్యం పిచ్చి కుదిరేనా: డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌తో వచ్చే వారికి మద్యం సరఫరాకు కేరళ సర్కార్‌ నిర్ణయం, తప్పుపట్టిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, ఎర్రగడ్డ ఆస్పత్రికి క్యూకట్టిన బాధితులు, వందల సంఖ్యలో ఓపీ కేసులు.
  • కరోనాకు 50 మంది డాక్టర్లు బలి: ఒక్క ఇటలీలోనే కరోనాకు 50 మంది డాక్టర్లు చనిపోయినట్టు డాక్టర్ల సంఘం ప్రకటన.
  • అమెరికా కంటే భారత్‌లోనే కరోనా మరణాల రేటు అధికం, అమెరికాలో 1 పాయింట్‌ 74 శాతం ఉంటే ఇండియాలో 2 పాయింట్‌ 70 శాతం ప్రపంచ సగటు 4 పాయింట్‌ 69 శాతం.
  • ఢిల్లీ లోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మతపరమైన ప్రార్దన కు వెళ్లి వచ్చిన వారిలో... 15 మందిని గుర్తించిన మియాపూర్ పోలీసులు. 10 మందిని టెస్టుల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలింపు. ఈ నెల 13 న ఢిల్లీ వెళ్లి 15 వ తేదీన తిరిగి వచ్చిన మియాపూర్ హఫీజ్ పేట్ కు చెందిన వాసులు..

రివ్యూ: ‘రాజు గారి గది 3’ – కామెడీ హిట్టే గానీ.. స్టోరీ మాత్రం..!

Raju Gari Gadhi 3 Telugu Review, రివ్యూ: ‘రాజు గారి గది 3’ – కామెడీ హిట్టే గానీ.. స్టోరీ మాత్రం..!

టైటిల్ : ‘రాజుగారి గది 3’

తారాగణం : అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ, ఊర్వశి, హరితేజ, బ్రహ్మాజీ తదితరులు

సంగీతం : షబీర్

నిర్మాతలు : ఓక్ ఎంటర్టైన్మెంట్స్

కథ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఓంకార్

విడుదల తేదీ: 18-10-2019

‘రాజు గారి గది’ సిరీస్‌లో భాగంగా వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రాజు గారి గది 3’. అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఏమేరకు మెప్పించింది ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ‌ :

ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న అశ్విన్(అశ్విన్ బాబు) తన కాలనీవాసులను ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంటాడు. ఇక అదే ఏరియాలో ఉండే మాయ(అవికా గోర్)ను ప్రేమిస్తున్నాం అని వెంటబడే వాళ్ళను ఆత్మలు టార్చర్ చేస్తుంటాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న కాలనీవాసులు మాయను అశ్విన్ ప్రేమించేలా ప్రేరేపిస్తారు. అశ్విన్ మాయను ప్రేమించడం మొదలుపెట్టినప్పటిని నుంచి అతని జీవితంలో అనుకోని సంఘటనలు జరగడం మొదలవుతాయి. అసలు ఎవరు ఈ మాయ.? ఆమె వెనక ఉన్న మిస్టరీ ఏంటి.? ఈ పరిస్థితులను అశ్విన్ ఎలా ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానాలు వెండితెరపై చూడాల్సిందే?

న‌టీన‌టుల అభినయం:

హీరో అశ్విన్ బాబు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మునపటి కంటే ఈ సినిమాలో నటన పరంగా ఎంతో పరిణితి చెందాడు. ఎమోషనల్, కామెడీ సీన్స్‌లో అద్భుతమైన పెర్ఫార్మన్స్‌ను కనబరిచాడు. అతనిలో ఉన్న అన్ని టాలెంట్స్‌ను దర్శకుడు ఓంకార్ బాగానే చూపించాడని చెప్పొచ్చు.

ఇక హీరోయిన్ అవికా గోర్ విషయానికి వస్తే.. మాయ పాత్రలో ఆమె నటన బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె పలికించిన హావభావాలు అద్భుతంగా ఉన్నాయి. అటు అలీ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు మేజర్  ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ధనరాజ్, బ్రహ్మాజీ, ప్రభాస్ శీను, హరితేజ వంటి నటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కటి నటన కనబరిచారు.

విశ్లేష‌ణ‌ :

‘రాజు గారి గది 2’తో పోలిస్తే.. ఈ సినిమాలో కామెడీ పై దర్శకుడు ఓంకార్ ప్రత్యేక దృష్టి సారించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌‌లో వచ్చే కామెడీ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. అయితే కామెడీ మీద ఎక్కువ శ్రద్ద పెట్టిన దర్శకుడు కథనాన్ని మాత్రం పక్కదోవ పట్టించాడు. దీనితో అక్కడక్కడా లాజిక్స్ మిస్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా డల్‌గా సాగితే.. క్లైమాక్స్ కూడా సోసోగానే ఎండ్ అవుతుంది.

సాంకేతిక విభాగాల పనితీరు:

ఓవరాల్‌గా సినిమా బాగుంది. దర్శకుడు కామెడీ మీద పెట్టిన దృష్టిని.. కథనంపై కూడా పెట్టినట్లయితే.. సినిమా మరింత అద్భుతంగా వచ్చేది. కెమెరా పనితనం బాగుంది. మ్యూజిక్ ఓకే..  బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

  • ప్రధాన పాత్రల నటన
  • సెకండ్ హాఫ్ కామెడీ

మైనస్‌ పాయింట్స్‌ :

  • కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు

Related Tags