తమన్నా ప్రధాన పాత్రలో.. ‘రాజు గారి గది 3’ ప్రారంభం

Raju Gari Gadhi 3, తమన్నా ప్రధాన పాత్రలో.. ‘రాజు గారి గది 3’ ప్రారంభం

హారర్ కామెడీగా తెరకెక్కి టాలీవుడ్‌లో మంచి విజయాన్ని సాధించిన ‘రాజు గారి గది’ సిరీస్‌లో మూడో చిత్రం రాబోతోంది. ఓంకార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా.. అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శీను, హరితేజ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టారు. స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుందని దర్శకుడు ఓంకార్ వెల్లడించారు. అలాగే ఈ చిత్రానికి ప్రముఖ రచయిత బుర్రా మాధవ్ మాటలు అందిస్తుండగా.. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారని ఆయన తెలిపారు. కాగా ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *