Breaking News
  • అమరావతి: చంద్రబాబు నివాసంలో సీనియర్‌ నేతల అత్యవసర భేటీ. టీవీ9 బిగ్ డిబేట్‌లో వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై చర్చ. ముఖ్య నేతలు పార్టీ వీడతారనే ప్రచారంపై పార్టీలో కలకలం. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. అనంతరం టీడీపీ ఎంపీలతో భేటీకానున్న చంద్రబాబు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.
  • మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిణామాలు. రాష్ట్రపతి పాలనకు తెరపడే అవకాశం. శివసేన, కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన సయోధ్య. శివసేనకు పూర్తికాలం సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకారం. కాంగ్రెస్‌, ఎన్సీపీకి డిప్యూటీ సీఎంతో పాటు 50 శాతం మంత్రి పదవులు. కాసేపట్లో సోనియా, పవార్‌ కీలక భేటీ.
  • తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. అనంతరం టీడీపీ ఎంపీలతో భేటీకానున్న చంద్రబాబు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.
  • అమరావతి: మంగళగిరిలోని చిల్లపల్లి కల్యాణమండపం చేరుకున్న పవన్‌. డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు. భవన నిర్మాణ కార్మికుల ఆకలి ప్రభుత్వానికి తెలిపేందుకే ఈ కార్యక్రమం. తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి-పవన్‌ కల్యాణ్‌.
  • గుంటూరు: రొంపిచెర్ల (మం) రామిరెడ్డిపాలెం సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం. ఓ కేసులో ఊరు విడిచి వెళ్లిన సర్పంచ్‌ కోటిరెడ్డి. పోలీసులు అరెస్ట్‌ చేయడంతో పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం. నర్సరావుపేట ఆస్పత్రికి తరలింపు.
  • తిరుపతి: చంద్రగిరి లక్ష్మీపురం చెరువు దగ్గర టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు. 45 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. తమిళనాడుకు చెందిన ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్‌.
  • సంగారెడ్డి జిల్లాలో నేడు మంత్రి హరీష్‌రావు పర్యటన. ఆందోల్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధికార్యక్రమాలు. సింగూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న హరీష్‌రావు. మంత్రి హరీష్‌రావుతో పాటు పాల్గొననున్న ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌.

‘రాజు గారి గది 3’ నుంచి తమన్నా వైదొలగడానికి కారణం అదేనా?

అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓంకార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజు గారి గది 3’. మొదట ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా ఎంపికైనా.. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ‘రాజు గారి గది’ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ మూడో చిత్రానికి ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను హీరో అశ్విన్ బాబు మీడియాతో పంచుకున్నారు.

‘రాజు గారి గది’ సిరీస్‌లో పది పార్టులు ఉండొచ్చు…

‘రాజు గారి గది’ చిత్రాన్ని తీసేటప్పుడు ఫ్రాంచైజ్ గురించి అసలు ఆలోచించలేదని హీరో అశ్విన్ అన్నాడు. టెక్నీషియన్స్‌ను నమ్ముకుని తీసిన ఈ సినిమా హిట్ కావడంతో.. పార్ట్ 2 తెరకెక్కించామన్నాడు. అయితే మొదటి పార్ట్ కంటే.. రెండో దానిలో ఎంటర్టైన్మెంట్ అనేది తగ్గిందని ప్రేక్షకులు భావించారు. కానీ, ఇప్పుడు వచ్చే ‘రాజు గారి గది 3’ సినిమాతో ప్రేక్షకులను తప్పకుండా ఎంటర్టైన్ చేస్తామని అశ్విన్ ధీమా వ్యక్తం చేశాడు. ఒకవేళ ఇది హిట్ అయితే.. పార్ట్ 4 ఉండొచ్చని హింట్ ఇచ్చాడు.

‘రాజు గారి గది 3’ పక్కా మాస్ ఎంటర్టైనర్…

‘రాజు గారి గది’లో మెడికల్ మాఫియా, పార్ట్ 2లో శత్రుత్వం, ఇగో అనే అంశాలను చూపించాం. ఈ రెండు చిత్రాల మాదిరిగా ‘రాజు గారి గది 3’లో సోషల్ మెసేజ్ ఉండదు. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే రీతిలో ఈ మూవీని తెరకెక్కించామన్నారు.

తమన్నా వైదొలగడానికి కారణం అదే…

ఈ చిత్రానికి మొదట తమన్నానే ఎంపిక చేశాం. అయితే ఆమెకు డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అంతేకాక ఆమె కోసం రెండు షెడ్యూల్స్ కూడా వాయిదా వేశాం. ఇక చివరికి ఆమె స్థానంలో అవికా గోర్‌ను ఎంపిక చేశాం. మరోవైపు ఈ సినిమాలో అవికా అద్భుతంగా నటించిందని కొనియాడాడు.