రజనీ కామెంట్స్ వెనుక ఆంతర్యం అదే

రజనీకాంత్.. పరిచయం అక్కరలేని పేరు.. తమిళనాట ఆ పేరు వింటేనే ఓ వైబ్రేషన్.. కానీ కొద్ది రోజులుగా రజనీకాంత్ కేంద్రంగా ఆందోళనలు.. పోలీస్ స్టేషన్ లో వరుస పిర్యాదులు.. తమిళులు ఆరాధ్య దైవంగా భావించే పెరియార్ రామస్వామిపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతోంది.. తమిళనాట ద్రవిడ పార్టీల పుట్టిన నాటి నుంచి నేటి వరకు అదే వాదం రాజ్యమేలుతోంది.. అలాంటి ద్రవిడ సిద్దాంతాల పితామహుడు పెరియార్‌పై రజనీ కామెంట్ చేసే సాహసం ఎందుకు చేశారు.. […]

రజనీ కామెంట్స్ వెనుక ఆంతర్యం అదే
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 25, 2020 | 11:32 AM

రజనీకాంత్.. పరిచయం అక్కరలేని పేరు.. తమిళనాట ఆ పేరు వింటేనే ఓ వైబ్రేషన్.. కానీ కొద్ది రోజులుగా రజనీకాంత్ కేంద్రంగా ఆందోళనలు.. పోలీస్ స్టేషన్ లో వరుస పిర్యాదులు.. తమిళులు ఆరాధ్య దైవంగా భావించే పెరియార్ రామస్వామిపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతోంది.. తమిళనాట ద్రవిడ పార్టీల పుట్టిన నాటి నుంచి నేటి వరకు అదే వాదం రాజ్యమేలుతోంది.. అలాంటి ద్రవిడ సిద్దాంతాల పితామహుడు పెరియార్‌పై రజనీ కామెంట్ చేసే సాహసం ఎందుకు చేశారు.. సాహసం వెనుక వ్యూహం ఉందా.. సందర్భోచితంగా మాట్లాడిందేనా..? ఇదిప్పుడు తమిళుల మదిని తొలుస్తున్న ప్రశ్న.

అక్కడ పాలించే పీఠం ద్రావిడ సిద్దాంతాల సొంతం అన్నట్లు గానే ప్రజలు తీర్పు ఇస్తున్నారు.. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ.. మిత్రపక్షం.. అన్నింటిదీ ఒకటే వాదం.. జాతీయ పార్టీ అయినా ఆ సిద్ధాంతాలకు తలవంచందే ఓట్లు రాలవు.. ఇప్పటి దాకా జరిగింది అదే.. దేశమంతా కనిపించే జాతీయ వాదానికి కూడా అక్కడ తావులేదు.. జల్లికట్టు విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కాదని ప్రత్యేక ఆర్డినెన్సుతో మినహాయింపు పొందిన విషయంలో తమిళుల కట్టు స్పష్టంగా అర్థం అవుతుంది.

అయితే ద్రవిడ వాదం.. వాటికి ప్రాణం పోసిన పెరియార్ లాంటి వాళ్లపై జరుగుతున్న దాడులు దేనికి సంకేతం అన్న చర్చ జరుగుతోంది.. తమిళనాట బీజేపీ నేతల నుంచి, కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్దమవుతున్న రజనీ కాంత్ దాకా వివాదాస్పద కామెంట్స్ వెనుక అసలు రహస్యం అదేనా..? ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమా..? ఓట్లు రాల్చుకునే వ్యూహంలో బాగమా..?

వివాదాలకు దూరంగా ఉండే తలైవా కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిన పరిస్థితులు రజనీ అభిమానులకు ఆశ్చర్యంతో కలిగించడంతోపాటు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఒక ప్రైవేట్ కార్యక్రమ వేదిక.. ఆ వేదికపై రజనీకాంత్ చేసిన కామెంట్స్ తమిళనాడు మొత్తం దూమారానికి కారణమైంది.. ఆ కామెంట్ అనుకోకుండా వచ్చింది కాదు.. ఆలోచనతో చేసిందే.. అంటారు రజనీని వ్యతిరేకించే వారు.. ఇంతకీ రజనీ చేసిన వ్యాఖ్యలు ఏంటి.. ?

ప్రముఖ మాగ్జైన్ తుగ్లక్ 50 వ వార్షికోత్సవ వేడుకలు ఇటీవల చెన్నైలో జరిగాయి.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.. ‘చో రామస్వామి’ నేతృత్వంలో నడిచిన ఈ మ్యాగజైన్ ఎన్నో సంచలనాలకు వేదిక అయిందని అన్నారు.. 1971 లో సీతారాములకు వ్యతిరేకంగా పెరియార్ రామస్వామి ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. సీతా రాముల ఫోటోకు చెప్పుల దండలు వేసి మరీ నిరసన తెలిపారు.. ఆ విషయాన్ని ఎవరూ వార్తగా ప్రచురించడానికి ముందుకు రాని ఈ పరిస్థితుల్లో చో రామస్వామి తుగ్లక్ పత్రికలో ఆ వార్తను ప్రచురించే సాహసం చేశారని .. అది రామస్వామి తెగువ అని పొగిడారు.. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి.

రజినీకాంత్ పెరియార్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని.. ఆ మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని ద్రవిడ సంఘాలు రాజకీయ పార్టీలు పెరియార్ అభిమాన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో రజినీకాంత్‌పై కేసులు కూడా నమోదయ్యాయి.. 1971లో రజినీకాంత్ చెప్పినట్టుగా అలాంటి ర్యాలీ ఎక్కడ జరగలేదని.. జరగని సంఘటనకు అవాస్తవాలు జోడించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ పెరియార్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని.. వ్యాఖ్యల వెనుక ఎవరో ఉన్నారని అనుమానాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికీ ఆందోళన జరుగుతూనే ఉన్నాయి.. రజినీకాంత్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని క్షమాపణ చెప్పాలని లేదంటే ఇంటిని ముట్టడిస్తామని ద్రవిడ సంఘాలు హెచ్చరించాయి.. అయితే దీనిపై మరోసారి స్పందించిన రజనీకాంత్ తన మాటలకు కట్టుబడి ఉన్నానని వెనక్కు తగ్గే సమస్య లేదని.. ఎన్ని ఆందోళనలు జరిగినా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.. దీంతో ద్రావిడ సంఘాలు పెరియార్ అభిమాన సంఘాలు రజినీకాంత్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు.. సంఖ్యలో ఆందోళనకారులు పోయెస్ గార్డెన్ లోని రజినీ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు.

రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఊహించని వివాదమా.. వ్యూహంలో భాగమా.. ఇపుడు ఇదే చర్చనీాంశమైంది.. త్వరలో రాజకీయ పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న రజినీకాంత్ బీజేపీకి దగ్గరవుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది.. బీజేపీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉండే రజినీకాంత్ బీజేపీ ఆలోచనలకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారా అన్న అనుమానాలకు, చర్చకు తావిస్తున్నాయి రజినీకాంత్ వ్యాఖ్యలు.

తమిళనాట బీజేపీ నేతల వ్యాఖ్యలు కూడా గతంలో పెరియార్ రామస్వామి అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యాయి. రెండేళ్ల క్రితం త్రిపురలో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్ట్ కోటలో బీజేపీ పాగా వేసింది.. ఆ వెంటనే కమ్యూనిస్టు పితామహుడుగా చెప్పుకునే కారల్ మార్క్స్ విగ్రహాలు ధ్వంసమయ్యాయి.. తీవ్ర వివాదానికి కారణమైన ఆ సంఘటనపై బీజేపీ నేతలు చేసిన కామెంట్లు, ట్వీట్లు తమిళనాట వివాదానికి కారణం అయ్యాయి..

ఆ తర్వాత ప్రముఖ తమిళ కవి తిరువల్లూరు విగ్రహానికి కాషాయ రంగులు వేయడం మరో వివాదానికి కారణమైంది.. అది కూడా బీజేపీ నేతలే చేశారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తమిళనాట ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. అధికారంలోకి ఏ పార్టీ రావాలన్నా.. ద్రవిడ సిద్ధాంతాలను ప్రచారం చేసుకుని ఓట్లు సాధించి సీట్లు పొందుతున్నాయి.. ఇక తమిళనాట పాగా వేయాలని పావులు కదుపుతున్న బిజేపి సిద్దాంతాలు ద్రవిడ సిద్దాంతాలకు భిన్నంగా ఉంటాయి. అలాగే కొత్త పార్టీ పెట్టనున్న రజినీకాంత్ సిద్ధాంతాలు కూడా ద్రవిడ పార్టీలకు భిన్నంగా.. బిజెపి సిద్ధాంతాలకు దగ్గరగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆమధ్య అభిమానుల సమక్షంలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేసిన రజనీకాంత్.. తాను ప్రజలకు ఆధ్యాత్మిక పాలనను అందించే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. గతంలో బీజేపీ నేతలు.. తాజాగా రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట మెల్లగా ద్రావిడ వాదాన్ని మసకబార్చే దిశగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

గతంలో అభిమానుల సమక్షంలో రాజకీయ పార్టీ ప్రకటన చేసిన రజనీకాంత్ తాను అధికారంలోకి వస్తే ఆధ్యాత్మిక పాలన అందిస్తామన్నారు.. ప్రస్తుతం ఉన్న ద్రవిడ పార్టీల పాలనకు బిన్నంగా తమ పార్టీ వైఖరి ఉండబోతోందని రజనీ చెప్పకనే చెప్పారు.. ఇపుడు ద్రవిడ పార్టీల పుట్టుకకు ప్రేరణ అయిన పెరియార్‌పై కామెంట్స్ రజనీ వైఖరి తన ఏమిటో స్పష్టం చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది.

మరోవైపు తమిళనాట రాజకీయాల్ని ముందుకు నడిపించింది ద్రవిడ వాదం.. కానీ కాల క్రమేణా ద్రవిడ పితామహుడు పెరియార్ రామస్వామి సిద్దాంతాలకు కనెక్ట్ కాని ఓటర్లు పెరిగిపోతున్నారు. పాత తరం ఓటర్లు ఇపుడు తగ్గారు. కాబట్టి రాబోయే రోజుల్లో క్రమేపీ దవిడ సిద్దాంతాల ప్రభావం రాజకీయాలపై ఉండదు.. ఆస్తికులను తమవైపు తిప్పుకోవడం.. పెరియార్ రామస్వామి సిద్ధాంతాలను కనుమరుగు చేయడం ద్వారా లబ్ధి పొందాలనేది అటు బీజేపీ.. ఇటు రజనీకాంత్ వ్యూహంగా ఉండొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం.. తమిళనాట కరుణానిధి, ఎంజీఆర్, జయలలితలను విమర్శించినా పెద్దగా పట్టించుకోరు.. కానీ పెరియార్ రామస్వామి, అన్నాదురై, కామరాజ నాడర్‌లను దేవుడి కంటే ఎక్కువగా ఆరాధిస్తారు.. వీళ్ళను ఏమైనా అంటే మాత్రం ఇలానే ఆందోళనలతో అట్టుడుకుతుంది. మరి ఇలాంటి పరిస్థితిని రజనీకాంత్ గానీ, బీజేపీ గానీ ఎలా ఎదుర్కొంటాయనేది ఆసక్తిగా మారుతోంది.

-మురళీ చెన్నూరు సీనియర్ జర్నలిస్టు, టివి9

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!