చల్లారిన ‘ తుపాన్ ‘… మరో నాలుగు కమిటీల్లో రాజ్ నాథ్

rajnath singh added to key committees, చల్లారిన ‘ తుపాన్ ‘… మరో నాలుగు కమిటీల్లో రాజ్ నాథ్

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి మోదీ ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆయనను మరో నాలుగు కమిటీల్లో నియమించింది. రాజ్ నాథ్ ని కేవలం రెండు కమిటీల్లో మాత్రమే తీసుకోవడంతో ఇందుకు నిరసనగా ఆయన పార్టీని వీడే యోచనలో ఉన్నారని, అందువల్లే మోదీ సర్కార్ డ్యామేజీ కంట్రోల్ లో భాగంగా వెంటనే ఆయనను మరో నాలుగు కేబినెట్ కమిటీల్లో నియమించిందని వచ్చిన వార్తలను రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం తోసిపుచ్చింది. తాజా సమాచారం ప్రకారం రాజ్ నాథ్ సింగ్ ని పార్లమెంటరీ, రాజకీయ వ్యవహారాలు, ఇన్వెస్టిమెంట్ అండ్ గ్రోత్, స్కిల్ డెవలప్ మెంట్ కమిటీల్లో నియమించారు. హోమ్ మంత్రి అమిత్ షా కు మోదీ కేబినెట్ లో నెం. 2 స్థానం కల్పించి అన్ని–8 కమిటీల్లోనూ ఆయనకు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు మోదీ కేబినెట్ లో అత్యధిక ప్రాధాన్యం ఇఛ్చి..రాజ్ నాథ్ సింగ్ ని పక్కన బెట్టారని వార్తలు జోరుగా హల్చల్ చేశాయి. ఒక దశలో ఇందుకు ఆయన మనస్తాపం చెందారని, పార్టీకి గుడ్ బై చెప్పాలనే ఆలోచనకు వచ్చారని ఊహాగానాలు తలెత్తాయి. అయితే వీటిని రక్షణ శాఖ కార్యాలయం తోసిపుచ్ఛుతూ .. అలాంటిదేమీ లేదని. రాజ్ నాథ్ కి మోదీ సర్కార్ ఎప్పుడూ తగినంత గౌరవం ఇస్తూనే ఉందని పేర్కొంది. ఇంతకుముందు అత్యంత కీలకమైన భద్రతా వ్యవహారాల కమిటీలో ఆయనకు స్థానం కల్పించారు. అటు-కేబినెట్ అపాయింట్ మెంట్ కమిటీలో మోదీ, అమిత్ షా మాత్రమే ఉన్నారు. మోదీ గత ప్రభుత్వ హయాంలో రాజ్ నాథ్ ఆయన కేబినెట్ లో నెం. 2 స్థానంలో కొనసాగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *