యంగ్‌ లుక్‌లో రజనీ.. సూపర్ తలైవా అంటోన్న ఫ్యాన్స్

Superstar Rajinikanth, యంగ్‌ లుక్‌లో రజనీ.. సూపర్ తలైవా అంటోన్న ఫ్యాన్స్

స్టైల్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరన్న సినీ పరిశ్రమ ఎరిగిన సత్యం. ఆయన సాధారణంగా నిల్చున్నా అందులో ఓ స్టైల్ ఉంటుంది. కాగా ఈ స్టైల్‌కు తోడు రాను రాను యవ్వనంగా తయారవుతున్నాడు సూపర్‌స్టార్. ఈ ఏడాది వచ్చిన పేటాలో యంగ్ లుక్‌లో దర్శనమిచ్చిన రజనీ.. ఇప్పుడు నటిస్తోన్న దర్బార్‌లో అలాగే కనిపించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ సెట్స్‌లో రజనీ ఉండగా.. ఆయనను ఫొటో తీసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

దానికి ‘‘మనవడితో రజనీ కాంత్ సర్. నా ఐఫోన్‌లో ఉన్న అద్భుత ఫొటో ఇది. రజనీ సర్ మానిటర్‌ను చూస్తున్నప్పుడు తీసిన ఫొటో’’ అంటూ కామెంట్ పెట్టాడు. ఇక ఈ ఫొటోకు రజనీ అభిమానులు ‘‘వాహ్వా సూపర్‌స్టార్’’.. ‘‘వావ్ తలైవా’’.. ‘‘తలైవా మీరు సూపర్’’ అంటూ తమ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. కాగా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న దర్బార్‌లో రజనీ సరసన నయనతార నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రేజీ కాంబోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై కోలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *