Breaking News
  • ఏపీ అసెంబ్లీలో మహిళల భద్రతపై స్వల్పకాలిక చర్చ. మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు-హోంమంత్రి సుచరిత. మహిళల రక్షణ, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. మహిళామిత్ర విభాగం ఏర్పాటు చేశాం. మహిళా కానిస్టుబుళ్లను నియమించాం. ఆత్మహత్యలు, ఒత్తిడి నిర్వహణ అంశాలపై కౌన్సెలింగ్‌. బాల్య వివాహాల నియంత్రణకు అవగాహన కల్పిస్తున్నాం-సుచరిత.
  • ప్రతి రైతుబజార్‌లో ఉల్లిని ప్రభుత్వం విక్రయిస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాం. 36,536 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నాం. మేం రూ.25కే కిలో ఉల్లి ఇస్తే హెరిటేజ్‌లో రూ.200కు అమ్ముతున్నారు.
  • మహిళల భద్రతపై చర్చిస్తుంటే టీడీపీ అడ్డుకుంటోంది. ఉల్లిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది-మంత్రి బుగ్గన. మహిళల పట్ల ప్రతిపక్షానికి బాధ్యతలేదు-మంత్రి బుగ్గన.
  • టీడీపీ ఎమ్మెల్యేలకు మహిళల భద్రత అవసరం లేదా-ఎమ్మెల్యే రజని. మహిళలు అభద్రతాభావంతో ఉన్నారు. మహిళల భద్రతపై మాట్లాడుతుంటే అడ్డుకుంటారా. మహిళల రక్షణపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు-ఎమ్మెల్యే రజని. మహిళలపై టీడీపీ నేతల నేరాలు బయటపడతాయనే చర్చను అడ్డుకుంటున్నారు. కాల్‌మనీ వ్యవహారంలో టీడీపీ నేతలకు సంబంధాలున్నాయి-ఎమ్మెల్యే రజని.
  • టీడీపీ సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని ఆగ్రహం. ఉల్లి ధరలపై సీఎం చర్చిస్తామన్నారు. మహిళల భద్రతపై చర్చను అడ్డుకోవడం తగదు. చర్చకు సహకరించాలని కోరిన స్పీకర్‌ తమ్మినేని.
  • దిశ ఘటనతో మహిళలందరూ తల్లడిల్లిపోయారు-రోజా. సీఎం జగన్‌పై మహిళలందరికీ నమ్మకం ఉంది. మహిళలందరూ తమ గోడును జగన్‌కు చెప్పాలనుకుంటున్నారు. ఒక మహిళను హోంమంత్రి చేసిన ఘనత జగన్‌ది. హోంమంత్రి మాట్లాడుతుంటే టీడీపీ అడ్డుకుంటోంది. కాల్‌మనీ, లోకేష్‌ ఫొటోలు, బాలకృష్ణ వ్యాఖ్యలపై.. చర్చ జరుగుతుందేమోనని టీడీపీ అడ్డుకుంటోంది. మహిళలంటేనే టీడీపీ నేతలకు చులకన భావం. మహిళల భద్రతపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు-రోజా. దిశ ఘటన తర్వాత మహిళలు భయపడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయి-రోజా. ఆంధ్రప్రదేశ్‌ అంటే ఆడవాళ్లప్రదేశ్‌గా మారాలి-రోజా. రేప్‌ చేసి చంపినప్పుడు గుర్తురాని మానవ హక్కులు.. ఎన్‌కౌంటర్‌ చేస్తే ఎందుకు గుర్తుకువస్తున్నాయి. దిశ కుటుంబసభ్యులను హెచ్‌ఆర్సీ ఎందుకు పరామర్శించలేదు-రోజా.
  • ఏపీ శాసనమండలిలో ఉల్లి ధరపై టీడీపీ వాయిదా తీర్మానం. మాతృభాషపై బీజేపీ వాయిదా తీర్మానం. వాయిదా తీర్మానాలను తిరస్కరించిన చైర్మన్‌. మండలిలో టీడీపీ సభ్యుల నిరసన.

చంద్రబాబుకు పవన్ ప్రత్యామ్నాయమా?..బిగ్ న్యూస్ బిగ్ డిబేట్

Big News Big Debate On 3122019, చంద్రబాబుకు పవన్ ప్రత్యామ్నాయమా?..బిగ్ న్యూస్ బిగ్ డిబేట్

ఏపీలో పాలిటిక్స్ రోజుకో కొత్త రంగు పులుముకుంటున్నాయి. ఇన్నాళ్లు వైసీపీ వెర్సస్ టీడీపీగా సాగిన రాజకీయంలోకి ఇప్పుడు జనసేన ఎంట్రీ ఇచ్చింది. అలాంటి, ఇలాంటి ఎంట్రీ కాదు ఏకంగా ప్రకంపనలే సృష్టిస్తోంది. ఇప్పటివరకు జగన్‌ ప్రభుత్వం మీద శివాలెత్తిపోతున్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌- సడెన్‌గా బీజేపీ మీద మనసు పారేసుకున్నారు. ఈ దేశానికి అమిత్‌ షా లాంటివాళ్లే కరెక్ట్‌ అని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అదే సమయంలో జగన్‌ను తాను ముఖ్యమంత్రిగానే గుర్తించనని చెప్పారు. పవన్‌ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్‌ ఇచ్చింది. తాము పవన్‌ని రాజకీయ నాయకుడిగా గుర్తించడం లేదని వైసీపీ మంత్రులు అంటున్నారు. అమిత్‌ షాను పొడుగుతూ, జగన్‌ను విమర్శిస్తూ- పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న రాజకీయాలు ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్.

చంద్రబాబుకు పవన్‌ దత్తపుత్రుడని వైసీపీ నాయకులు కొంతకాలంగా విమర్శిస్తున్న వేళ, జనసేనాని తిరుపతిలో లాయర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కలకలం పుట్టించాయి. సీమలో హైకోర్టు కావాలన్న డిమాండ్‌పై స్పష్టంగా జవాబు చెప్పని పవన్‌ కల్యాణ్‌, ఈ అంశంపై తానెందుకు తిట్లు తినాలని వ్యాఖ్యానించారు. ఈ దేశానికి అమిత్‌ షా లాంటి వ్యక్తులు కరెక్ట్‌ అన్నారు. అలాంటివాళ్లు ఉక్కుపాదంతో అణచేస్తారని చెప్పారాయన.

ఇసుక, అమరావతి, చంద్రబాబు భద్రత వంటి అంశాలపై టీడీపీ నిర్దిష్టమైన కార్యక్రమాలకు పరిమితమైన వేళ, పవన్‌ వర్సెస్‌ వైసీపీ మధ్య యుద్ధం కొత్త ఎత్తుకు వెళ్లింది. అమిత్‌ షాను పొడుగుతూ పవన్‌ మాట్లాడటం ఇప్పుడు కొత్త చర్చను లేవనెత్తింది. ఇక ఇదే అంశంపై ఈరోజు టీవీ9 బిగ్ న్యూస్ – బిగ్ డిబేట్ నిర్వహించింది. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ పలు కీలక ప్రశ్నలను చర్చలో పాల్గొన్న నాయకుల వద్ద రైజ్ చేశారు. ఏపీలో చంద్రబాబు నాయుడిని డామినేట్ చేసి పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్నారా అని రజినీకాంత్, జనసేన లీడర్‌ శివ శంకర్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన ఏం సమాధానాలు చెప్పారు. శివశంకర్ సమాధానాలకు టీడీపీ, బీజేపీ ఎలా రెస్పాండ్ అయ్యాయో దిగువ వీడియోలో చూడండి.