నవంబర్‌లో రజనీకాంత్‌ పార్టీ.. స్పష్టం చేసిన సన్నిహితుడు..

సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం ఈ ఏడాదిలో చేయబోతున్నట్లు ఆయన సన్నిహితుడు కరాటే తియగరాజన్ తెలిపారు. తియగరాజన్ రజనీకి అత్యంత సన్నిహితుడు. ఆయన గతంలో చెన్నై నగరానికి..

నవంబర్‌లో రజనీకాంత్‌ పార్టీ.. స్పష్టం చేసిన సన్నిహితుడు..
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2020 | 6:06 AM

సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం ఈ ఏడాదిలో చేయబోతున్నట్లు ఆయన సన్నిహితుడు కరాటే తియగరాజన్ తెలిపారు. తియగరాజన్ రజనీకి అత్యంత సన్నిహితుడు. ఆయన గతంలో చెన్నై నగరానికి డిప్యూటీ మేయర్‌గా వ్యవహరించారు. తొలుత మార్చి 12వ తేదీన పార్టీని ప్రారంభిద్దామని రజనీకాంత్ భావించారని.. అయితే అప్పటికే దేశంలో కరోనా టెన్షన్ స్టార్ట్ అయ్యిందన్నారు. ఈ క్రమంలో పార్టీ ప్రారంభం వాయిదా పడిందన్నారు. అయితే అప్పుడు ఆగస్టులో పార్టీని లాంచ్ చేద్దామని అనుకున్నారని.. కానీ ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని కూడా వాయిదా వేశారన్నారు. నవంబర్‌లో మాత్రం ఖచ్చితంగా పార్టీ ప్రారంభమవుతుందని కరాటే తియగరాజన్ ఓ జాతీయ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ వివరించారు.