Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

మళ్లీ ‘ఉఫ్’మనిపించిన రజనీ

, మళ్లీ ‘ఉఫ్’మనిపించిన రజనీ

చెన్నై: తన అభిమానులు మరోసారి ‘ఉఫ్’ అనేలా ప్రకటన చేశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఏడాది క్రితం రాజకీయాల్లోకి ప్రవేశించిన రజనీ.. రజనీ మక్కల్ మంద్రమ్ అనే వేదికను ఏర్పాటు చేసి మద్దతుదారులు, అభిమానులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రజనీ పోటీ చేస్తారని వారందరూ అనుకున్నారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు రజనీ. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. మన లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలే’’ అంటూ రజనీ ప్రకటించారు.

, మళ్లీ ‘ఉఫ్’మనిపించిన రజనీ

తాను ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదు. ప్రచార సమయంలో నా ఫొటో గానీ, సంస్థ జెండాను గానీ ఎవరూ వాడొద్దు. తమిళనాడు నీటి సంక్షోభాన్ని ఏ పార్టీ శాశ్వతంగా పరిష్కరిస్తుందని భావిస్తున్నారో దానికే ఓటు వేయండి అంటూ రజనీ కాంత్ తెలిపారు. ఆదివారం జిల్లా కార్యదర్శులతో జరిగిన కార్యక్రమంలో రజనీకాంత్ ఈ మేరకు చెప్పారు. 2020 ఆగష్టు నెలలో పార్టీని ఏర్పాటుచేద్దామని, ఆ తరువాత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకుంటామని రజనీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని రజనీ చెప్పడంపై అభిమానులు కాస్త అసంతృప్తికి లోనైనట్లు సమాచారం.