సూపర్‌స్టార్ రజనీకాంత్‌ ఆరోగ్యంపై వార్తలు.. స్పందించిన పీఆర్‌ టీమ్‌

సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై మళ్లీ వార్తలు గుప్పుమన్నాయి. రజనీ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, చికిత్స తీసుకుంటున్నారని పుకార్లు వచ్చాయి.

  • Manju Sandulo
  • Publish Date - 6:13 pm, Sun, 22 November 20

Rajinikanth Health News: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై మళ్లీ వార్తలు గుప్పుమన్నాయి. రజనీ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, చికిత్స తీసుకుంటున్నారని పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన పీఆర్‌ టీమ్‌ స్పందించింది. రజనీకాంత్ ఆరోగ్యంపై మీడియాలో వస్తోన్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. నిన్నటి నుంచి రజనీ పోయెస్‌ గార్డెన్‌లోని నివాసంలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాగా గత నెలలో తనకు ఆరోగ్యం కాస్త బాలేదని రజనీ వెల్లడించారు. రెస్ట్‌ తీసుకుంటున్నానని సూపర్‌స్టార్ తెలిపిన విషయం తెలిసిందే. (ఎన్టీఆర్ బాటలో.. ‘ఆర్‌ఆర్‌ఆర్’కి‌ బ్రేక్‌ ఇవ్వనున్న మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్‌)

కాగా ఇటీవల దీపావళి వేడుకలను రజనీ తన నివాసంలో జరుపుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలను రజనీ చిన్న కుమార్తె సౌందర్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రజనీ, శివ దర్శకత్వంలో అన్నాత్తేలో నటిస్తున్నారు. ఇందులో రజనీ సరసన ఖుష్బూ, మీనా, నయనతార జోడీ కడుతున్నారు. కీర్తి సురేష్‌ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. (విషమంగానే అసోం మాజీ సీఎం తరుణ్‌ గొగొయి ఆరోగ్య పరిస్థితి.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తోన్న వైద్యులు