చైనాలో చరిత్ర సృష్టించించిన రజనీ రోబో 2.0

Rajinikanth-Akshay Kumar film 2.0 gets a new release date in China

సూపర్‌స్టార్ రజనీకాంత్ మూవీ అంటే చెప్పక్కర్లేదు. భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమాలకు ఉన్నక్రేజ్ అలాంటిది. ఆ మధ్య శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన రోబో 2.0 మూవీ గుర్తుందా.. ఇప్పుడు చైనాలో సరికొత్త చరిత్ర సృష్టించింది. చైనాలో అత్యధిక ధియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ చిత్రం సెప్టెంబరు 6న అక్కడ విడుదల కాబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

నిజానికి జులై 12న ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేయాలని నిర్మాత భావించినప్పటికీ లయన్ కింగ్ విడుదలకు ఇబ్బంది లేకుండా రోబో 2.0ను వాయిదా వేసుకున్నారట. లైకా ప్రొడక్షన్స్‌.. హెచ్‌వై మీడియా సంస్థతో కలిసి సినిమాను చైనాలో విడుదల చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 47 వేల కంటే ఎక్కువ స్క్రీన్లపై ప్రదర్శించబోతున్న ఈ ఇండియన్‌ చిత్రం ఇదే కావడం మనకు గర్వకారణం. రోబోకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీశారు. విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ నటించగా, రజనీ సరసన అమీ జాక్సన్ నటించింది. మన దేశంలో గత ఏడాది నవంబర్‌లో విడుదలై అత్యధిక వసూళ్లను రాబట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *