రాజస్థాన్‌లోని చురులో.. 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. 

ఓవైపు అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముంబైని భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు.. రాజస్థాన్‌లో జూలైలోనూ ఎండలు మండుతున్నాయి. ఎండ వేడిమి, ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 1:42 am, Sun, 5 July 20

ఓవైపు అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముంబైని భారీవర్షాలు ముంచెత్తాయి మరోవైపు.. రాజస్థాన్‌లో జూలైలోనూ ఎండలు మండుతున్నాయి. ఎండ వేడిమి, ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆ రాష్ట్రంలో చురు జిల్లాలో శనివారం గరిష్ఠంగా 43డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. ఎండ ధాటికి తాళలేక స్థానిక ప్రజలు చెట్ల నీడన, కూలర్ల కింద సేదదీరారు.

కాగా.. రానున్న 24గంటల్లో రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో వర్షం లేదా ఇసుక తుపాను సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. జులై నెలలోనూ రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే రీతిలో తీవ్రత కొనసాగితే తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశముందని ఆవేదనకు లోనవుతున్నారు.

Also Read: యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్డిసివిర్ డోసేజ్‌లో మార్పులు: కేంద్రం