Breaking News
  • ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని నడపలేం-సీఎం కేసీఆర్‌. ఆర్టీసీకి ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్లు. ప్రస్తుతం ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఆర్టీసీకి ఆర్థిక భారం మోసే శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. ఆర్టీసీకి ఉన్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదు. హైకోర్టు తీర్పు తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం-కేసీఆర్‌
  • హైదరాబాద్‌: నేడు రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ. హైకోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ
  • చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలమైందనడం సమంజసం కాదు. ఇలాంటి ప్రయోగాల్లో చిన్న సమస్యలు తలెత్తే అవకాశం సాధారణం. అంతమాత్రాన చంద్రయాన్‌-2 విఫలమైందనడం సరికాదు -కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌
  • ఎస్‌పీజీ సెక్యూరిటీ ఉపసంహరణపై ప్రియాంకాగాంధీ స్పందన. రాజకీయాల్లో భాగంగానే సెక్యూరిటీ తొలగించారు. ఇకపై ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయి-ప్రియాంక
  • తాజ్‌మహల్‌ పరిసరాల్లో డ్రోన్లు ఎగరేసిన విదేశీ యాత్రికులు. రష్యాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • దేశంలో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు.. పెట్టుబడుల ఉపసంహరణ సరైన పరిష్కారం కాదు-మమతాబెనర్జీ. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం తాత్కాలిక ఉపశమనమే. ఇలాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి దోహదం చేయవు-మమత
  • సియాచిన్‌పై పాకిస్తాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు. సియాచిన్‌ వివాదాస్పద ప్రాంతం. అలాంటి ప్రాంతంలో భారత్‌ పర్యాటకాన్ని ఎలా ప్రారంభిస్తుంది. భారత్‌ నుంచి ఎలాంటి మంచిని ఆశించడంలేదన్న పాక్‌
  • ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. గౌహతి, షిల్లాంగ్‌లో కంపించిన భూమి. భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసిన జనం

మరో చెన్నై కాబోతున్న జైపూర్ ..పింక్ సిటీకి వాటర్ కష్టాలు

Rajasthan's capital Jaipur is the latest city that could face an acute water crisis soon., మరో చెన్నై కాబోతున్న జైపూర్ ..పింక్ సిటీకి వాటర్ కష్టాలు

నీటిని బ్యాంకులో డబ్బు మాదిరిగా జాగ్రత్తగా కాపాడుకునే పరిస్థితులొచ్చాయి.ఒక వైపు భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతుంటే మరోవైపు పలు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడనుందనే వార్త ఆందోళనకు గురిచేస్తుంది. చెన్నైలో గతంలో ఎన్నడూ లేనంతగా నీటి కరవుతో జనం అల్లాడిపోయారు. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో నీటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని వరణదేవుని కరుణకోసం పూజలు చేస్తున్నారు. కొందరు సంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రకారం కప్పలకు పెళ్లిళ్లు చేస్తూ .. ఎవరికి తోచిన విధంగా వారు ఆకాశం వైపు చూడాల్సి వస్తుంది.
ఇదిలా ఉంటే వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురవకపోతే మరో రాష్ట్రం కూడా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల చెన్నైలో ఎదుర్కొన్న దారుణ పరిస్థితులకంటే ఎక్కువగా రాజస్ధాన్‌ రాజధాని జైపూర్‌లో మరీ ఎక్కువగా ఈ సమస్య ఉండబోతుందని చెబుతున్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఈ సమస్య మరింత జఠిలమయ్యే పరిస్థితులు ఉన్నాయంటున్నారు. రాజస్థాన్‌లో గత దశాబ్ధకాలంలో భూగర్భ జలాలు 62 శాతం మేర తగ్గిపోయాయి.

రాజస్ధాన్ ముఖ్యపట్టణం జైపూర్‌‌లో గత ఏడాది ఇదే సమయానికి 225 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఈ ఏడాది 116 మిల్లీ మీటర్లు కురిసింది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో నీటి సమస్యతో అల్లాడిపోవడం తప్పదని హెచ్చరిస్తున్నారు జైపూర్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ అధికారులు. రాజస్దాన్‌లో గల 12 జిల్లాల్లో గత ఏడాది తో పోల్చితే ఇప్పటివరకు 60 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు. దాదాపు 30 లక్షల జనాభా కలిగిన జైపూర్ నగరానికి మంచినీటిని అందించే బిలాస్‌పూర్ డ్యామ్‌లో మరో నెల రోజులకు సరిపడా నీరు మాత్రమే ఉంది. దీంతో రానున్న నీటికరువును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు నీటిని ఒడిసి పట్టాలని సూచిస్తున్నారు . కురుస్తున్న ప్రతి వాన చినుకును ఇంకుడు గుంతలకు మళ్లిస్తే భూగర్భ జలాలు పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. వర్షపు నీటిని వృధా చేయకుండా ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించి వాటిని ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.