నాలుగు నెలల బాలుడి అంత్యక్రియలు చేయనివ్వని గ్రామస్తులు..!

మనషుల్లో మానవత్వం మరుగునపడుతోంది. రానురాను మరి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం పసిపిల్లలపైనా కూడా కనికరం చూపడంలేదు. డయేరియాతో చనిపోయిన నాలుగు నెలల బాలుడు.. కరోనా సోకి మరణించాడంటూ అంత్యక్రియులు జరిపేందుకు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ఓ అధికారి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. రాజస్థాన్ భిల్వారా జిల్లా చవాంఢీ గ్రామానికి చెందిన సురేశ్ కుమావత్ కుటుంబం ముంబైలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. కరోనా కారణంగా పనిలేక పోవడంతో సురేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన […]

నాలుగు నెలల బాలుడి అంత్యక్రియలు చేయనివ్వని గ్రామస్తులు..!
Follow us

|

Updated on: May 30, 2020 | 6:40 PM

మనషుల్లో మానవత్వం మరుగునపడుతోంది. రానురాను మరి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం పసిపిల్లలపైనా కూడా కనికరం చూపడంలేదు. డయేరియాతో చనిపోయిన నాలుగు నెలల బాలుడు.. కరోనా సోకి మరణించాడంటూ అంత్యక్రియులు జరిపేందుకు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ఓ అధికారి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. రాజస్థాన్ భిల్వారా జిల్లా చవాంఢీ గ్రామానికి చెందిన సురేశ్ కుమావత్ కుటుంబం ముంబైలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. కరోనా కారణంగా పనిలేక పోవడంతో సురేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన సొంతూరు వెతుకుంటూ చవాంఢీ వచ్చారు. సురేశ్ కుటుంబ సభ్యులకు అధికారులు నిర్వహించిన కరోనా టెస్ట్ ల్లో తండ్రి సురేశ్ కు కరోనా సోకినట్లు నిర్ధారించారు. అతని నాలుగు నెలల పసికందుకు డయేరియాతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సురేశ్ ను కరోనా వార్డ్ ఉన్న ఆస్పత్రికి..చిన్నారిని చిల్డ్రన్స్ ఆస్పత్రికి, కుటుంబసభ్యుల్ని హోం క్వారంటైన్ కు తలించారు. అయితే డయేరియాతో ఆరోగ్యం విషమించడంతో పసికందు మరణించాడు. దీంతో ఆస్పత్రికి సిబ్బంది చిన్నారి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే చిన్నారికి అంత్యక్రియలు చేసేందుకు చవాంఢీ గ్రామస్తులు అంగీకరించలేదు. చిన్నారికి కరోనా సోకింది అంటూ ముందుకు రావడానికి నిరాకరించారు. కుటుంబసభ్యుల్ని సైతం అంత్యక్రియలు జరపడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. చవాంఢీ గ్రామంలో చిన్నారికి అంత్యక్రియలు చేయనివ్వడంలేదన్న సమాచారం అందుకున్న సబ్ డివిజనల్ ఆఫీసర్ మనిపాల్ సింగ్ చవాండీ గ్రామానికి వెళ్లారు. చిన్నారికి కరోనా సోకలేదని, డయేరియాతో మరణించాడని గ్రామస్తుల్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఊరి గ్రామస్తులు చిన్నారికి అంత్యక్రియలు చేసేందుకు అంగీకరించలేదు. దీంతో మనిపాల్ సింగ్ పసికందు మృతదేహాన్ని తన చేతులతో స్మశాన వాటిక వరకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. మానవత్వం లేని సమాజంలో మంచి మనిషి ఉన్నాడని నిరూపించాడు. దీంతో మనిపాల్ చేసిన పనిని ప్రతిఒక్కరు ప్రశంసిస్తున్నారు.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?