రాజస్తాన్….’జులై 31 నుంచి సభను సమావేశపరచాలి’…. సీఎం అశోక్ గెహ్లాట్

రాజస్తాన్ అసెంబ్లీని జులై 31 నుంచి సమావేశపరచాలని సీఎం అశోక్ గెహ్లాట్..గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కోరారు. ఈ మేరకు ఆయనకు ఓ కొత్త ప్రతిపాదన పంపారు. అయితే ఈ ప్రతిపాదనలో రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభం గురించి గానీ..

రాజస్తాన్....'జులై 31 నుంచి సభను సమావేశపరచాలి'....  సీఎం అశోక్ గెహ్లాట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 26, 2020 | 1:47 PM

రాజస్తాన్ అసెంబ్లీని జులై 31 నుంచి సమావేశపరచాలని సీఎం అశోక్ గెహ్లాట్..గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కోరారు. ఈ మేరకు ఆయనకు ఓ కొత్త ప్రతిపాదన పంపారు. అయితే ఈ ప్రతిపాదనలో రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభం గురించి గానీ, సభలో  తన బల నిరూపణ గురించిగానీ ప్రస్తావించలేదు. కరోనా వైరస్ పరిస్థితిపైన, ఆరు బిల్లులను ప్రవేశపెట్టడానికి గల అవకాశాలపైన చర్చించడానికి శాసన సభను సమావేశపరచాలని మాత్రమే ఆయన అభ్యర్థించారు. అటు తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ.. రాష్ట్రపతి భవన్ వద్ద గానీ, ప్రధాని నివాసం వద్ద గానీ ధర్నాకైనా సిధ్ధమని గెహ్లాట్ ప్రకటించిన నేపథ్యంలో.. ఇక దీన్ని హైలైట్ చేసేందుకు దేశవ్యాప్తంగా డిజిటల్ ప్రచారాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ‘స్పీకప్ ఫర్ డెమోక్రసీ’ పేరిట ఈ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికి పార్టీ నేత రాహుల్ గాంధీ ‘ఆశీస్సులు’ కూడా ఉన్నాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి.