రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కరోనా..!

రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంద్రజిత్ మహంతికి కోవిడ్ 19 పాజిటివ్ గా వచ్చినట్లు.. ప్రస్తుతం అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం అశోక్ గెహ్లాట్ శనివారం ట్వీట్‌ వేదికగా తెలిపారు.

రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కరోనా..!
Follow us

|

Updated on: Aug 16, 2020 | 1:36 PM

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. పట్టణాలు, పల్లెలు అనే తేడాలు లేకుండా విస్తరిస్తుంది. సాధారణ ప్రజానికం నుంచి ప్రముఖుల వరకు అనేక మంది కరోనాబారిన పడుతున్నారు. ఇప్ప‌టికే కరోనావైరస్ బారినపడిన వారిలో ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు, ఉన్నతాధికారులు ఉండగా.. తాజాగా ఆ జాబితాలో రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంద్రజిత్ మహంతి కూడా చేరారు. ఇటీవల రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా సీజేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సీఎం గెహ్లాట్ ట్వీట్‌లో సమాచారం ఇచ్చారు. . ప్రస్తుతం ఆయ‌న సెల్ఫ్ ఐసోలేష‌న్ ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంద్రజిత్ మహంతికి కోవిడ్ 19 పాజిటివ్ గా వచ్చినట్లు.. ప్రస్తుతం అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సీజే త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ సీఎం అశోక్ గెహ్లాట్ శనివారం ట్వీట్‌ వేదికగా తెలిపారు.

కాగా, శనివారం జస్టిస్ మహంతి కోర్టు అవరణలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయ అధికారులు, వంద మంది న్యాయవాదులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఆదివారం వైరస్ పరీక్షించాలని అధికారులు కోరారు. పరీక్షలు నిర్వహించడానికి వైద్య బృందం రాజస్థాన్ హైకోర్టు బార్ కార్యాలయానికి చేరుకుంది. ఇక, ఇప్పటివరకు రాజస్థాన్‌లో 58,900 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అటు రాజస్తాన్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి 846 మంది మరణించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!