బ్రేకింగ్ : బీజేపీలో విషాదం.. కీలక నేత కన్నుమూత

Rajasthan BJP Chief Madan Lal Saini Passes Away, బ్రేకింగ్ : బీజేపీలో విషాదం.. కీలక నేత కన్నుమూత

బీజేపీలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ రాజస్థాన్ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కన్నుమూశారు. అస్వస్థత కారణంగా రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే సోమవారం సాయంత్రం చికిత్స పోందుతూ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. మదన్ లాల్‌ మృతితో ఆ రాష్ట్ర బీజేపీలో విషాదం నెలకొంది. కాగా ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మదన్ లాల్ మృతితో పలువురు విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సైనీ మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఓ కుటుంభ సభ్యుడిని కోల్పోయిందని.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైనీ మృతిపై విచారం వ్యక్తం చేశారు. పార్టీకి కానీ.. ఆ రాష్ట్ర ప్రజలకు గానీ ఆయన సేవలు మరువలేనివన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. రాజస్థాన్ సీఎం విచారం వ్యక్తం చేశారు. సైనీజీ ఇక లేరని తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యానని.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ట్వీట్ చేశారు. సైనీ ఆత్మకు శాంతికలగాలని కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *