ఆగస్టు 14 నుంచి రాజస్తాన్ అసెంబ్లీ సీఎం అశోక్ గెహ్లాట్ కి ఊరట !

రాజస్తాన్ రాజకీయ సంక్షోభానికి దాదాపు తెర పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర శాసన సభ ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు గవర్నర్ కల్ రాజ్ మిశ్రా కార్యాలయం ఓ నోటీసులో ప్రకటించింది. అసెంబ్లీ సెషన్ పై..

ఆగస్టు 14 నుంచి రాజస్తాన్ అసెంబ్లీ  సీఎం అశోక్ గెహ్లాట్ కి ఊరట !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 30, 2020 | 10:17 AM

రాజస్తాన్ రాజకీయ సంక్షోభానికి దాదాపు తెర పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర శాసన సభ ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు గవర్నర్ కల్ రాజ్ మిశ్రా కార్యాలయం ఓ నోటీసులో ప్రకటించింది. అసెంబ్లీ సెషన్ పై సీఎం అశోక్ గెహ్లాట్ కి, గవర్నర్ కి మధ్య చాలా సార్లు సమావేశాలు జరిగాయి. శాసన సభ ఐదో సెషన్ ని వచ్ఛే నెల 14 నుంచి ప్రారంభించాలన్న కేబినెట్ అభ్యర్థనను గవర్నర్ ఆమోదించారని ఈ నోటీసులో పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా 21 రోజుల నోటీసు ఇవ్వకుండా సభను సమావేశపరచాలనడంలో ఔచిత్యం లేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ఆయన చాలాసార్లు స్పష్టం చేశారు. కాగా తాము మొదట విజ్ఞప్తి చేసిన తేదీ నుంచి 21 రోజుల తరువాత  సెషన్ ని ఏర్పాటు చేయాలని గెహ్లాట్ కోరుతున్నారు.

ఇలా ఉండగా ఇటు బీజేపీ, అటు సచిన్ పైలట్ వర్గం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టులో తమకు ‘విజయం’ లభించినట్టే లభించి చేజారిపోయిందని పైలట్ వర్గం ఆందోళన చెందుతోంది. ఆగస్టు 14 నుంచి అసెంబ్లీని సమావేశపరచేందుకు గవర్నర్ అంగీకరించడంతో సచిన్ ఇక తమ భవిష్యత్ కార్యాచరణకు సిధ్ధపడుతున్నారు.