Breaking News
  • చిత్తూరు: మదనపల్లెలో మహిళా సంఘాల ఆందోళన. నిందితుడిని ఉరి తీయాలంటూ చిన్నారి వర్షిత తల్లిదండ్రుల ధర్నా. తమకు న్యాయం చేయాలంటున్న వర్షిత తల్లిదండ్రులు. రఫీని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్. విద్యుత్‌ టవర్‌ ఎక్కిన వర్షిత కుటుంబ సభ్యులు. కిందకు దించేందుకు పోలీసుల ప్రయత్నాలు.
  • వివాదంలో జార్జిరెడ్డి సినిమా. ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపణ. సినిమాలో జార్జిరెడ్డి రౌడీయిజాన్ని చూపెట్టాలన్న ఏబీవీపీ. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించిన పోలీసులు. ఈ నెల 22న విడుదల కానున్న జార్జిరెడ్డి.
  • వరంగల్‌: ఏనుమాముల మార్కెట్ యార్ట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం. ప్రభుత్వ హామీతో తిరిగి కొనుగోళ్లు ప్రారంభించిన కాటన్ వ్యాపారులు.
  • ఢిల్లీ చేరుకున్న ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌. సా.4గంటలకు సోనియాతో భేటీ కానున్న శరద్‌పవార్‌. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి కార్యాచరణపై చర్చ.
  • హైదరాబాద్‌: హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ. తాకట్టు పెట్టిన అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసిన బ్యాంకర్లు. సంవత్సరం గడిచినా కొనుగోలుదారులకు అందని కన్‌ఫర్మేషన్‌ ఆర్డర్. కన్‌ఫర్మేషన్‌ ఇవ్వాలని కోరిన బ్యాంకర్లు. డిసెంబర్‌ 5న మరోసారి విచారిస్తామన్న హైకోర్టు. తదుపరి విచారణ డిసెంబర్‌ 5కు వాయిదా.
  • లోక్‌సభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు. ప్రాంతీయ భాషా పరిరక్షణపై కేశినేని నాని ప్రశ్న. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలి-కేశినేని నాని. ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం ఉంది-కేశినేని నాని. పలు అంశాలపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతున్న సభ. తెలుగు భాష ఉన్నతికి చర్యలు తీసుకుంటున్నాం-మంత్రి పోఖ్రియాల్‌.
  • ఆగ్రా జిల్లా పేరు మార్చే యోచనలో యూపీ సర్కార్. ఆగ్రా పేరును ఆగ్రావన్‌గా మార్చాలని యూపీ సర్కార్‌ యోచన. కాషాయికరణలో భాగంగా పేరు మారుస్తున్నారని విపక్షాల విమర్శలు. గతంలో ఫైజాబాద్‌ను అయోధ్యగా.. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన యూపీ సర్కార్.

వరుస హత్యల వెనుక రహస్యాలు.. సస్పెన్స్‌కు తెరతీసిన ‘కల్కి’ టీజర్!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కల్కి’. ఇప్పటికే రిలీజైన చిత్ర టీజర్, సాంగ్ ప్రోమోస్ చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేస్తే.. రీసెంట్‌గా విడుదల చేసిన ‘హానెస్ట్ ట్రైలర్’ ప్రేక్షకుల్లో మరింత సస్పెన్స్‌ను పెంచేసింది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే దాదాపు ఇది సినిమా రివ్యూను తలపించే విధంగా సాగింది. 19వ దశకంలో తెలంగాణ రాష్ట్రంలోని కొల్లాపూర్ అనే ఊరి ఎమ్మెల్యే(అశుతోష్ రానా)తమ్ముడు శేఖర్ బాబును ఎవరో దారుణంగా హత్య చేస్తారు. ఇక ఈ హత్య గురించి వివరాలు సేకరించే పనిలో ఓ యువకుడు(రాహుల్ రామకృష్ణ) ఆ ఊరిలోకి దిగుతాడు. అటు కేసు ఇన్వెస్టిగేషన్ పనిలో ఆఫీసర్ కల్కి(రాజశేఖర్) రంగప్రవేశం చేస్తాడు. అందరూ అనుకున్నంత సులభమైన కేసు ఇది కాదు.. ఆ హత్య వెనుక ఎన్నో రహస్యాలు, పగ, ప్రతీకారాలు దాగి ఉంటాయి. అవి ఏంటి.? కల్కి ఈ కేసును ఎలా చేధించాడు అనేది తెలియాలంటే సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే.

‘ఆకాశవాణి.. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్‌బాబు దారుణ హత్య తర్వాత నర్సప్ప పెరుమాండ్ల వర్గీయుల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి’ అన్న డైలాగ్‌‌తో మొదలైన ట్రైలర్‌ చివరి వరకు సస్పెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ట్రైలర్ మధ్యలో స్వామీజీ పాత్రలో నాజర్ పలికిన డైలాగ్ ‘హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు. యుద్ధం చేయాల్సింది మాత్రం రాముడే’ అన్నదాన్ని హైలైట్ చేశాడు. ఆ తర్వాత రాజశేఖర్ గొడ్డలి పట్టుకుని వచ్చే బిల్డప్ షాట్స్.. అలాగే వెనక వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాయి.

ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి చెప్పాలంటే తన మొదటి సినిమా ‘అ’ మాదిరిగానే.. ఈ ‘కల్కి’ సినిమాను కూడా తనదైన శైలి టేకింగ్, సస్పెన్స్ తో ఆధ్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకం‌పై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ‘గరుడ వేగా’ తర్వాత రాజశేఖర్‌కు మరో హిట్ ఖాయమనిపిస్తోంది.