గురుదక్షిణగా “కోటి” ఇల్లు.. ది గ్రేట్ తలైవా గిఫ్ట్ ఎవరికి..?

సూపర్ స్టార్ రజనీకాంత్ డైలాగ్ చెప్పినా.. స్టెప్పు వేసినా అదరహో అనాల్సిందే. ఇక థియేటర్‌లో అయితే రజనీ సినిమా విడుదలైందంటే చాలు గోలగోల చేస్తారు అభిమానులు. రజనీ ఏ పని చేసినా స్పెషల్‌గానే ఉంటుంది. అలాంటి హీరో రియల్ లైఫ్ లో ఓ మంచి పని చేస్తే అభిమానులు ఎంతో సంతోషిస్తారు. రజనీ ఏం చెప్తే అది తప్పకుండా చేస్తారు. సినీ పరిశ్రమలో తాను గురువుగా భావించే సీనియర్ దర్శక నిర్మాత కలైజ్ఞానంకు ఓ ఇంటిని బహుకరించి […]

గురుదక్షిణగా కోటి ఇల్లు.. ది గ్రేట్ తలైవా గిఫ్ట్ ఎవరికి..?
Follow us

| Edited By:

Updated on: Oct 08, 2019 | 12:27 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ డైలాగ్ చెప్పినా.. స్టెప్పు వేసినా అదరహో అనాల్సిందే. ఇక థియేటర్‌లో అయితే రజనీ సినిమా విడుదలైందంటే చాలు గోలగోల చేస్తారు అభిమానులు. రజనీ ఏ పని చేసినా స్పెషల్‌గానే ఉంటుంది. అలాంటి హీరో రియల్ లైఫ్ లో ఓ మంచి పని చేస్తే అభిమానులు ఎంతో సంతోషిస్తారు. రజనీ ఏం చెప్తే అది తప్పకుండా చేస్తారు. సినీ పరిశ్రమలో తాను గురువుగా భావించే సీనియర్ దర్శక నిర్మాత కలైజ్ఞానంకు ఓ ఇంటిని బహుకరించి కృతజ్ఞత చాటుకున్నారు. సినీ పరిశ్రమకు కలైజ్ఞానం చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ కోలీవుడ్ ప్రముఖులు ఇటీవల అభినందన సభను ఏర్పాటుచేశారు. కలైజ్ఞానం అద్దె ఇంట్లో ఉంటున్నారని.. ఆయనకు సొంత ఇల్లు లేదని ఎవరో ప్రస్తావించారు. అది తెలుసుకున్న రజనీ తన గురువుకు బహుమతిగా తానే ఇల్లు ఇస్తానని ప్రకటించారు.

కొద్ది రోజుల్లోనే చెన్నైలోని విరుగాంబాక్కమ్‌లో రూ. కోటి విలువైన ఇంటిని కోనుగోలు చేసి ఆయనకు ఇచ్చారు. తానే స్వయంగా వెళ్లి ఇంట్లో పూజలు జరిపించి.. వారిచే గృహప్రవేశం చేయించారు. రజీని సోలోగా నటించిన తొలి సినిమా భైరవి. కలైజ్ఞానం నిర్మించిన ఈ చిత్రం 1978లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినీ రంగంలోకి అడుగుపెట్టిన మొదట్లో సినిమా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో కలైజ్ఞానం తనను ఆదుకున్నారని తలైవా గుర్తుచేసుకున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..