Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

చెర్రీకి..జక్కన్న స్వీట్ వార్నింగ్..!

జక్కన్న.. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనే కళాఖండాన్ని చెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై నేషన్ వైడ్‌గా బజ్ క్రియేట్ అయ్యింది. ఇక చిత్ర షూటింగ్ మాత్రం నత్తనడకన సాగుతోంది. రాజమౌళి ఆల్రెడీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నేపథ్యంలో..మూవీ అనుకున్న టైంకి వస్తుందో, లేదో అని ఫ్యాన్స్ తెగ కంగారుపడుతున్నారు.

ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ముందుగా రాజమౌళి తనయుడు..కార్తికేయ పెళ్లి నేపథ్యంలో షూట్‌కి స్మాల్ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత..ఇద్దరు హీరోలు గాయాలపాలవ్వడంతో మరికొంత ఆలస్యం అయింది. ఇక తాజాగా చరణ్..జక్కన్నకు చిక్కులు తెచ్చిపెడుతున్నాడట. ఎన్టీఆర్ మొదటి నుంచి  ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసమే పూర్తిగా సమయం కేటాయించారు. అదిరిపోయే ఫిజిక్ కోసం కూడా చాలా కష్టపడ్డారు కూడా.  కానీ చరణ్ మాత్రం మొదటి నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం పూర్తిగా టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నాడు.

గతేడాది ఎండింగ్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రారంభం అయ్యింది.  ఆ సమయంలో చరణ్ ‘వినయ విధేయ రామ’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు చెర్రీ. అది కంప్లీట్ అయ్యాక..ఆయన తండ్రి ప్రతిష్ఠాత్మకంగా భావించిన ‘సైరా’ చిత్ర నిర్మాణ బాధ్యతలు బుజానికి ఎత్తుకున్నాడు. దీంతో చరణ్‌కు క్షణం తీరిక లేకుండా పోయింది. ఆ చిత్రం రిలీజయ్యి, ప్రమోషన్స్ అయ్యేవరకు చెర్రీ అంతా తానై వ్యవహరించాడు. ఇక ఏ పనులు లేవు..ఫుల్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం పనిచేస్తాడనుకుంటున్న టైమ్.. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాను లాంచ్ చేశారు.  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చరణ్ కూడా ఒక నిర్మాత. దీంతో రాబోయే రోజుల్లో చరణ్ బిజీగా ఉండనున్నాడు.  దీంతో రాజమౌళి..’ఆర్‌ఆర్‌ఆర్’ పై దృష్టిపెట్టాలని చరణ్‌కు చిన్న వార్నింగ్ ఇచ్చాడట.

జక్కన్న సినిమా కోసం ఎంత డెడికేషన్ చూపిస్తారో అందరికి తెలిసిందే. పాత్రల వేషధారణ, పద్దతులు, సెట్లు విషయంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే చరణ్‌కు కాస్త గట్టిగా చెప్పాల్సి వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మరి చెర్రీ ఛేంజ్ అవుతాడో, లేదో చూడాలి.