Breaking News
  • దేశవ్యాప్తంగా దీపయజ్ఞం. ప్రధాని మోదీ పిలుపు మేరకు దీపాలు వెలిగించిన దేశ ప్రజలు. దీపం వెలిగించిన రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు. దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా వెలుగొందిన భారత్‌. తెలుగు రాష్ట్రాల్లో దీపాల కాంతులు. ప్రగతి భవన్‌లో దీపాలు వెలిగించిన సీఎం కేసీఆర్‌. తాడేపల్లిలోని తన నివాసంలో దీపాలు వెలిగించిన ఏపీ సీఎం జగన్‌. దీపాలు వెలిగించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌లు తమిళిసై, భిశ్వభూషణ్. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. అత్యవసరసేవలు అందిస్తున్న వైద్యులు, పోలీసులు.. పారిశుద్ధ్య సిబ్బందికి దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపిన ప్రజలు.
  • 130 కోట్ల ప్రజల మహాశక్తిని చాటిన భారతీయులు. దీప యజ్ఞంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు. కుటుంబ సమేతంగా దీపం వెలిగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తన నివాసంలో దీపాలు వెలిగించిన ప్రధాని మోదీ. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన కేంద్ర మంత్రులు, ఎంపీలు.
  • ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ ఫోన్‌. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 20 కోట్ల గన్నీ బ్యాగ్‌లు అవసరం. ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌. గన్నీ బ్యాగ్‌లకు తీవ్ర కొరత ఉందని వివరించిన సీఎం కేసీఆర్‌. పశ్చిమబెంగాల్‌లో గన్నీ బ్యాగ్‌ల పరిశ్రమలు తెరిపించాలన్న కేసీఆర్‌. పరిశ్రమలు తెరిపిస్తేనే గన్నీ బ్యాగ్‌ల సమస్య తీరుతుందన్న కేసీఆర్‌. పశ్చిమ బెంగాల్‌ నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా గన్నీ బ్యాగ్‌లు.. తీసుకొచ్చేందుకు అనుమతించాలని ప్రధాని మోదీకి కేసీఆర్‌ విజ్ఞప్తి. సంబంధిత శాఖలతో మాట్లాడతానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.
  • ఒక్క తప్పుడు మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేసినా కేసులు బుక్‌ చేస్తాం. వెరిఫై చేయకుండా సోషల్‌ మీడియాలో వీడియోలు షేర్‌ చేయొద్దు. డిజిటల్‌గా వెదికి పట్టుకుని అరెస్ట్‌ చేస్తాం. నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన వారిలో ఎవరూ కావాలని.. కరోనా వ్యాప్తి చేశారనడానికి ఆధారాలు లేవు. -టీవీ9 ఎన్‌కౌంటర్‌ విత్‌ మురళీకృష్ణలో అంజనీకుమార్‌, సజ్జనార్‌.
  • కర్నూలులో కరోనా విజృంభణ. ఒకేరోజు 12 పాజిటివ్‌ కేసులు నమోదు. 12 మంది ఢిల్లీ సభలకు వెళ్లివచ్చిన వారే. కర్నూలులో మొత్తం 53 కరోనా కేసులు నమోదు. కాంటాక్ట్‌ కేసులపై దృష్టిపెట్టిన అధికారులు.

రాజమౌళి కెలికినా.. సైలెంట్‌‌గా వర్మ.. కారణమేంటి..!

Rajamouli comments on RGV, రాజమౌళి కెలికినా.. సైలెంట్‌‌గా వర్మ.. కారణమేంటి..!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ‌ను ఎవ్వరూ అంత ఈజీగా కెలికాలనుకోరు. ఎందుకంటే ఒక్కసారి గిల్లితే, ఆయన సెటైరికల్‌ కామెంట్లను తట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు. అందుకే పేరుమోసిన సినీ, రాజకీయ ప్రముఖులు సైతం వర్మకు దూరంగా ఉంటూ వస్తుంటారు. ఇక ఆయనే ఎవరినైనా వివాదంలోకి లాగినా.. చాలామంది ఆయన నుంచి తప్పించుకునేందుకే ప్రయత్నిస్తుంటారు. అలాంటిది మొదటిసారిగా వర్మను ఆటపట్టిస్తూ ట్వీట్ చేశారు దర్శకధీరుడు రాజమౌళి. వర్మ కుమార్తె ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మకు కంగ్రాట్స్ చెప్పిన జక్కన్న.. వర్మను కాస్త ఆటపట్టించారు.

‘‘కంగ్రాట్స్ రాము తాతయ్య గారు. ఫైనల్‌గా మీ మనవరాలు మీకు కళ్లెం వేస్తుందని ఆశిస్తున్నా. ఇదంతా సరే గానీ మిమ్మల్ని రాము తాత, రాము నాన్న, గ్రాండ్‌పా రాము వీటిలో మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు’’ అంటూ కామెంట్ పెట్టారు. ఈ ట్వీట్‌కు వర్మను సైతం ట్యాగ్ చేశారు. అయితే మనవరాలు వచ్చిన సంతోషమో.. మరేమో తెలీదు గానీ వర్మ మాత్రం ఇంకా రాజమౌళికి సమాధానం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే గతంలో రాజమౌళిని ఉద్దేశిస్తూ పలుమార్లు ఆర్జీవీ ట్వీట్లు చేశారు. ఆ సమయంలో ‘‘అయ్యా.. నన్ను ఒగ్గేయండయ్యా’’.. ‘‘నన్ను ఇన్వాల్వ్ చేయకండి రాజు గారు’’ అంటూ రాజమౌళి కామెంట్లు పెట్టిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల వర్మ జోరు తగ్గించారు. ఒకప్పుడు ఎప్పుడూ వివాదాల్లో ఉండే వర్మ.. ఈ మధ్యన కాంట్రవర్సీలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. ట్విట్టర్‌లోనూ ఆయన సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే. మరి ఈ మార్పుకు కారణమేంటోనని ఫ్యాన్స్ ఆలోచనల్లో పడ్డారు.

Related Tags