ఓఆర్​ఆర్​ పై విరగిపడ్డ కొండ చరియలు

నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా​  ఔటర్​ రింగు రోడ్డు(ఓఆర్​ఆర్​)పై కొన్ని చోట్ల ఉన్న కొండ చరియలు విరిగి రోడ్డపై పడ్డాయి.

ఓఆర్​ఆర్​ పై విరగిపడ్డ కొండ చరియలు
Follow us

|

Updated on: Sep 17, 2020 | 7:08 PM

నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా​  ఔటర్​ రింగు రోడ్డు(ఓఆర్​ఆర్​)పై కొన్ని చోట్ల ఉన్న కొండ చరియలు విరిగి రోడ్డపై పడ్డాయి. గురువారం సాయంత్రం ఓఆర్​ఆర్​ రాజేంద్రనగర్​ ఎగ్జిట్​–16 సమీపంలో కొండ చరియలు విరిగి రోడ్డపైన పడ్డాయి. విషయం తెలిసిన వెంటనే హెచ్​ఎండిఏ, హెచ్.జి.సి.ఎల్, ఓఆర్​ఆర్​ అధికారులు హుటా హుటిన ఆ ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్​ ను డైవర్ట్​ చేసి పరిస్థితులను చక్కదిద్దారు. ఓఆర్​ఆర్​ నిర్మాణంలో భాగంగా ఎత్తైన కొండలు, గుట్టల మధ్య నుంచి రోడ్డు నిర్మాణ పనులు చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు  న‌గరంలో రాబోయే మూడు గంట‌ల పాటు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్.డి.ఆర్‌.ఎఫ్, మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్‌లు, అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.‌ ప్ర‌జ‌లు అన‌వ‌స‌రంగా బ‌య‌ట‌కు రావ‌ద్దని సూచించారు. అత్య‌వ‌స‌ర స‌హాయానికై జిహెచ్ఎంసి టోల్ ఫ్రీ నెం: 040-21111111 లేదా 040-29555500 నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చని చెప్పారు.

Also Read :

ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్

హైదరాబాద్ లో మరో 3 గంటలు భారీ వర్షాలు, అత్య‌వ‌స‌ర సహాయం కోసం నంబర్లు